[pప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క సరైన విజయం అందుకోలేక పోయినా సరే జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. బాలీవుడ్ లోసరైన విజయం అందుకో లేకపోయినా సరే ఇతర ఇండస్ట్రీలో ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకులు హీరోలు తెగ ఆరాటపడుతున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ లో జాన్వీ ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. అంతేకాకుండా రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కమిట్ అయిన సినిమాలు విడుదల కన్నా ముందే కోలీవుడ్‌లో తన మొదటి సినిమా చేయడానికి రెడీ అయిపోయింది జాన్వీ.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసేది కమల్ హాసన్ అట. లోకనాయకుడు కమలహాసన్- శ్రీదేవిది సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పుడు తనకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను కోలీవుడ్‌లో పరిచయం చేసే బాధ్యతను కమలహాసన్ తన భుజాలపై వేసుకున్నాడట.
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార భర్త విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ టుడే సినిమాలో హీరోగా చేసిన ప్రదీప్ రంగనాథ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలోనే హీరోయిన్గా జాన్వీ కపూర్ ని తీసుకునేలా కమల్ ఆలోచిస్తున్నాడంటూ కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీంతో జాన్వీ కపూర్ పేరు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.