టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఫస్ట్ సినిమాతోనే గ్లామర్‌లుక్ తో అందరికీ పరిచయమైన అనుష్క మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుస సినిమాలతో అందరి అగ్ర హీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తరకెక్కిన అరుంధతి సినిమాతో అనుష్క క్రేజ్ మరింత పెరిగింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.
రాజమౌళి దర్శకత్వంలో తర్కెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది.
అనుష్క నటించిన సైజ్ జీరో, పంచాక్షరి, భాగమతి సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆమె కెరియర్ కు కొంతకాలం బ్రేక్ పడింది. తర్వాత నిశ్శబ్దం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్కకు ఈ సినిమా కూడా సక్సెస్ అందించలేకపోయింది.
సైజ్ జీరో సినిమాతో బాగా లావుగా అయిన అనుష్క సినిమా ఛాన్సులు తగ్గడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తుంది. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా అనుష్కకు కూడా తన లైఫ్ లో ఒక ఫస్ట్ లవ్ ఉందట.
ఆమె ఇప్పటికి ఆ విషయాన్ని గుర్తుంచుకుంది. గతంలో జయప్రద హోస్ట్ గా ఉన్న ఓ షోలో అనుష్క పాల్గొంది. ఆ షోలో జయప్రద నీ ఫస్ట్ ప్రపోజల్ గురించి చెప్పమనడంతో నాకు ఫస్ట్ ప్రపోజల్ సిక్స్‌త్ స్టాండర్డ్ లో జరిగిందని.. అప్పటికి ప్రపోజల్ అంటే ఏంటో నాకు తెలియదని.. తన క్లాస్‌మెట్ ఒక అతను వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సిక్స్‌త్ స్టాండర్డ్ లోనే అనుష్కకు ప్రపోజ్ చేశాడా? వీడు మామూలోడు కాడుగా.. అంటు అంత చిన్న ఏజ్ లో అనుష్కకి ప్రపోజ్ చేశాడంటే వాడెవడో గడుసోడె అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.