చెల్లి అని పిలిచి హీరోయిన్ శ్రీదేవిని ప్రెగ్నెంట్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

చిత్ర పరిశ్రమకు బాలనటిగా అడుగుపెట్టి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసి తన అంద చందాలతో తన నటనతో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకుంది శ్రీదేవి. అప్పట్లో శ్రీదేవి అందం ముందు ఎలాంటి హీరోయిన్ అయినా సరే వేస్ట్ అనే విధంగా ఉండేది. అలాంటి శ్రీదేవి ఒకానొక సమయంలో చిరంజీవి లాంటి హీరో పక్కన నటించడానికి కూడా కండిషన్లు పట్టిందంటే ఆమె ఎంతటి క్రేజ్‌ తెచ్చుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.

అలాంటి అతిలోక సుందరి అతి చిన్న వయసులోనే హీరోయిన్‌గా మారి మన పాత తరం హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ వంటి వాళ్లతోనే కాకుండా వారి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున వంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది. అలాంటి శ్రీదేవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే శ్రీదేవి స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఆమె సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయినా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది.

అతి చిన్న వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో మిధున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుని విడాకులుు తీసుకుని ఎన్నో ఇబ్బందులు పడింది. అలాంటి సమయంలోనే శ్రీదేవికి రాఖీ కట్టిన వ్యక్తి అంటే అన్న అని పిలిచే వ్యక్తితో గర్భవతి అయిందట. శ్రీదేవి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మారింది. అలాంటి శ్రీదేవి మొదటి భర్త మిథున్ చక్రవర్తికి దూరమైనన సమయంలో శ్రీదేవిని ఎలాగైనా త‌న‌ బుట్టలో పడేయాలని బోనీకపూర్ ట్రై చేసేవారట.

శ్రీదేవిని పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకుని సినిమా కోసం పది లక్షల అడిగితే 11 లక్షలు ఇచ్చి ఆమెను ఆ సినిమాలో తీసుకున్నారట. ఆ తర్వాత ఎలాగైనా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బోనీకపూర్ ఈ విధంగా ప్లాన్లు వేసుకుంటూ వస్తున్నారు. అప్పటికే బోనీ కపూర్ కి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆయనకు శ్రీదేవి అంటే ఇష్టం. కానీ శ్రీదేవి ఆయన్ను అన్నయ్య అని పిలుస్తూ రాఖీ కూడా కట్టిందట.

కానీ బోనికపూర్ మాత్రం పెళ్లి చేసుకోవాలని భావించి ఆమె వెన్నంటే ఉంటూ శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకున్నారట. అలా శ్రీదేవికి దగ్గరై వివాహం చేసుకున్నారట బోనీ కపూర్. మరోవైపు పెళ్లికి ముందే శ్రీదేవి తల్లి అయిందట. ఎందుకంటే తాను పెళ్లి చేసుకుంటాను అంటే మొదటి భార్య ఒప్పుకోదని.. గర్భవతి అయితే ఎలాగైనా పెళ్లి చేసుకోమని చెబుతారని ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారట బోనీ కపూర్.