స్టార్ సెలబ్రిటీస్ అన్నాక పార్టీలు, పబ్ లు, జల్సాలు సర్వసాధారణం. అలా ఇటీవల ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో షార్ట్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది ఓ టాలీవుడ్ హీరోయిన్. ఇంతకీ ఎవరు హీరోయిన్? అనుకుంటున్నారా. దేవుళ్ళు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన నిత్యాశెట్టి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది.
పడేసావే సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఓ పిట్ట కథ, నువ్వు తోపురా, వాంటెడ్, కాదల్ కాలం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె నటించిన సినిమాలన్నీ చిన్న సినిమాలు కావడం.. అదేవిధంగా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అంతగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది.
కొన్ని టీవీ షోలలో హడావిడి చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి హాజరైంది. ఆ పార్టీలో ఫుల్ గా చిల్ అవుతూ కనిపించింది. ఆ బర్త్‌డే పార్టీలో నిత్యాశెట్టి ఫుల్ గా ముందు కొడుతూ ప్రత్యక్షమైంది. షార్ట్స్ పైన షార్ట్ లాగిస్తూ నిత్య శెట్టి ఎంజాయ్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.