టాలీవుడ్‌లో ఇలియానా ఎంట్రీయే ఓ సంచలనం. రామ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో పోకిరి లాంటి బ్లాక్‌బస్టర్. అక్కడ నుంచి వరుస పెట్టి స్టార్ హీరోలకు జోడీగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఇక్కడ ఫామ్‌లో ఉండగానే బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిపోవాలన్న ఆశలతో అక్కడకు వెళ్లి చేతులు కాల్చుకుంది.
ఇక గత కొంత కాలంగా ఇలియానా మరీ బో..గా వ్యవహరిస్తోంది. ఆమె మాటలు, ఫొటోలు అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. ఇక ఇలియానా ప్రేమ పై ఇప్పటికే రకరకాల పుకార్లు వినిపించాయి. ఈ లోపే ఆమె గర్భవతి అని తేలింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన ఇన్‌స్టాలో బయట పెట్టుకుంది. అయితే తన కడుపులో పెరుగుతోన్న బిడ్డకు తండ్రి ఎవరు ? అన్నది మాత్రం ఆమె ప్రకటించకుండా సస్పెన్స్‌లో పెట్టింది.
మధ్యలో ఒక ఫొటో కూడా బయట పెట్టినా.. అందులో ఉన్న వ్యక్తి ఎవరు ? అన్నది మాత్రం తెలియకుండా జాగ్రత్త పడింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో తన భాగస్వామితో కలిసి దిగిన ఫొటో షేర్ చేసింది. ఇలియానాను తల్లిని చేసింది ఎవరు ? అన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు అన్నది ఇప్పటకీ క్లారిటీ లేదు.
ఇప్పటి వరకు ఇలియానా ప్రియుడు ఎవరు ? అన్నదానిపై స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ సోదరుడు ‘సెబాస్టియన్ లారెంట్ మిచెల్’ అనే అందరూ అనుకున్నారు. అతడితో ఆమె లవ్ లో ఉందని.. ఆ ప్రేమ ఫలితంగానే ఆమె తల్లి కాబోతుంది అని ఇన్నాళ్లు ప్రచారం ఉంది. ఇప్పుడు ఇలియానా షేర్ చేసిన ఫోటోలోని వ్యక్తి మాత్రం కొత్త వ్యక్తి.. అతడు ముంబైకి చెందిన వ్యాపారి అని తెలుస్తోంది. ఏదేమైనా అసలు ఇలియానా ప్రెగ్నెంట్‌కు కారణం ఎవరో ఏం తెలియని డైలమా నడుస్తోంది.