ఈ ఫొటోలో పాప జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్‌… టాప్ హీరో భార్య.. గుర్తు ప‌ట్టారా ?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్న పాప ఎవరో ? గుర్తుపట్టారా.. ఈమె తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో.. సౌత్ లో కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల పక్కన ఎన్నో సినిమాలలో నటించి తన అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె స్మైల్ ఇచ్చింది అంటే చాలు కుర్రాళ్ళు ఇట్టే పడిపోయేవారు. కేవలం ఆమె కోసమే సినిమాలు చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టేవారు. ఒకే ఒక్క సినిమాతో కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జరిగిన ముద్ర వేసుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోల సరసన నటించి తక్కువ టైంలోనే పాపులర్ హీరోయిన్ అయిపోయింది. ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుని ఇద్దరు మగ పిల్లలకు తల్లి అయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాల్లో రీయంట్రీ ఇచ్చేందుకు ఆశపడుతోంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ? కాదు జెనీలియా.

తమిళంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో సుమంత్ హీరోగా సత్యం సినిమాలో నటించి బాగా పాపులర్ అయింది. బొమ్మరిల్లు సినిమా ఆమెను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌ను చేసేసింది. రెడీ – హ్యాపీ – ఎన్టీఆర్ తో సాంబ, నా అల్లుడు రామ్ చరణ్ తో ఆరెంజ్ – తరుణ్ తో శశిరేఖ పరిణయం ఇలా ఎన్నో సినిమాలలో నటించింది.

జెనీలియాని తెలుగు జనాలు తమ సొంత ఇంటి అమ్మాయిలా చూసుకునేవారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముక్‌ కొడుకు, బాలీవుడ్ స్టార్ హీరో రితీష్ దేశముఖ్‌ను ప్రేమించి పెళ్లాడిన జెనీలియా ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయింది. వీరిద్దరూ కలిసి తెలుగులో వచ్చిన నువ్వే కావాలి సినిమా రీమేక్ తుజే మేరీ కసమ్‌లో జంటగా నటించి ఆ సినిమా షూటింగ్ టైంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.