ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకోవాలన్న.. ఆ స్టార్ డంను కొనసాగించాలన్న మంచి ఫిజిక్ ఉండడం చాలా అవసరం. అలా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ యాక్టర్స్ ఫిజిక్ మెయింటెన్ చేయడానికి డైటింగ్ అంటు, జిమ్ అంటూ కడుపునిండా తిండి కూడా సరిగా తినకుండా తమ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇటీవల చాలామంది స్టార్ ముద్దుగుమ్మలు సడన్గా మంచి ఫిజిక్‌ను కోల్పోయి బొద్దుగా తయారవుతున్నారు. తాజాగా వారి లిస్టులోకే చేరిపోయింది బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ.
అరియానా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి యాంకర్ స్టేజ్ నుంచి స్టార్ సెలబ్రిటీ రేంజ్ కి ఎదిగింది. ఎంతో కష్టపడి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయినా అరియానా ఈషో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత సోషల్ మీడియాతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.
వర్మతో అరియానా ఇంటర్వూలే ఆమెను కావాల్సినంత పాపులర్ చేసేశాయి. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అరియానా బక్కపలచటి నడుముతో తన అందచందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోషూ..*ట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారును టెంప్ట్ చేసేది. అలాంటిది తాజాగా అరియానా పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె లావెక్కిన బుగ్గలతో, పొట్ట ముందుకు వచ్చి బాగా లావుగా కనిపించింది.
దీంతో చాలామంది నెటిజన్స్ ఈ అసలు ఈమె అరియానానేనా..? ఏంటి ఇలా తయారయింది..? అంటూ షాక్ అవుతున్నారు. బొద్దుగా ఉన్న బాగున్నావ్ అరియానా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అరియానాని నెగిటివ్‌గా కామెంట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కొత్త ఫ్రెండ్‌షిఫ్‌లో పడి విచ్చలవిడిగా మెక్కడం, ఓవర్ నైట్ పార్టీలలో ఎంజాయ్ చేస్తూ పబ్బులు చుట్టూ తిరిగితే ఇలానే ఉంటుంది అంటూ తిట్టుపోస్తున్నారు.