టాలీవుడ్‌లో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యకి ఎలాంటి గ్రేస్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసింది. బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఎంతోమంది ఉన్నా… పాన్ ఇండియా లెవెల్లో హిట్స్ కొట్టి.. రు. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఉన్నా… కానీ బాలయ్య పేరు చెప్పగానే జనాల్లో ఒక ఎనర్జీ వస్తుంది.
అలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడు బాలయ్య. పైఫొటోలో బాలయ్య చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్నది స్టార్ హీరో… కానీ ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ఫోటోలో ఉన్న బుడ్డోడు సినిమా ఇండస్ట్రీలో చేసిన కొన్ని సినిమాలైనా జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఆ హీరో ఎవరో మీరు గుర్తు పట్టేసి ఉండొచ్చు. అతడే బాలయ్య అన్నగారైన మోహన్ కృష్ణ కొడుకు తారకరత్న.
ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే తారకరత్న చిన్న వయస్సులోనే చనిపోవడం చాలా బాధాకరం. చిన్నప్పటి నుంచి బాలయ్యతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాడు అట తారకరత్న. అంతేకాదు బాలయ్యకి కూడా తారకరత్న అంటే చాలా ఇష్టం. తారకరత్న ఎక్కువుగా బాలయ్యతోనే ఉండేవాడట. తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు ఇంటికి దూరమయ్యాడు.
తర్వాత ఈ దంపతులకు ఓ పాప పుట్టాక బాలయ్యే స్వయంగా తారకరత్న కుటుంబాన్ని తిరిగి నందమూరి కుటుంబానికి దగ్గర చేశాడు. ఇక తారకరత్న చనిపోవడంతో బాలయ్య చాలా బాధపడ్డాడు. తారకరత్నను బతికించుకునేందుకు బెంగళూరు హాస్పటల్లో ఎన్నో రాత్రులు ఉండి కష్టపడ్డాడు. ఏదేమైనా తన అన్న కొడుకుతో బాలయ్య చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు ఇలా వైరల్ అవుతోంది.