తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది సమంత. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సమంత తన నిజ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ భారిన పడిన సమంత చేతికి సిలైన్ పెట్టుకొని మరి షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు మనం ఎన్నో చూశాం.
ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటిని కంప్లీట్ చేసి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సమంత ప్లాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్‌లో సిటాడెల్ వెబ్ సిరీస్ లో తన షూటింగ్ కూడా పూర్తయ్యింది.
సమంత ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందనుకుంటోన్న టైంలో ఫ్యాన్స్ కు ట్విస్ట్ ఇచ్చింది. ఆమెకు చిరకాల కోరిక ఒకటి ఉందని.. దానికోసం చివరి నిమిషంలో అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందని తెలుస్తుంది. సమంత ఇండస్ట్రీలోకి రాక మునుపటి నుంచే ఆమెకు లాంగ్ రోడ్ ట్రిప్ చేయాలని కోరిక ఉండేదట. మొదట్లో సరైన డబ్బు లేక ఆగిపోయిన సమంత.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ షెడ్యూల్లో గడుపుతూ ఆ కోరిక తీర్చుకోలేకపోయింది.
ప్రస్తుతం కొంతకాలం షూటింగ్ కు సెలవిచ్చిన సమంత ఎలాగైనా తన కోరికను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో అమెరికా ప్లాన్ క్యాన్సిల్ చేసి మరి ప్రస్తుతం రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. సమంత ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలోని అన్ని దేవాలయాలను దర్శించుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ట్రిప్ పూర్తయిన తర్వాత తిరిగి అమెరికా ప్రయాణం ఉండబోతుందట.