టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది పూజాహెగ్డే. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఛాన్సుల కోసం రక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ లోను కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది పూజాహెగ్డే. హృతిక్‌రోషన్‌కు జోడీగా ఆమె చేసిన మొహంజోదారో సినిమా పెద్ద డిజాస్టర్.
కొంతకాలం క్రితం మహేష్ బాబు హీరోగా నటించిన ” గుంటూరు కారం ” సినిమాలో పూజానే హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు. ఇండస్ట్రీలో మొదటి నుంచే పొగరుగా నడుచుకుంటున్న పూజా హెగ్డే.. ఇటీవల తన ఆటిట్యూడ్‌ను మరింతగా పెంచేయడంతో ఆమెను గుంటూరు కారం సినిమా నుంచి తీసేసారంటున్నారు.
ప్రస్తుతం డైరెక్టర్ సంపత్ దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో పూజా హెగ్డే – సాయి ధరంతేజ్‌తో కలిసి నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన పూజా హెగ్డే.. సాయిధరమ్‌తో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
ఇటీవల పూజా హెగ్డే ఎలాంటి సినిమాలు అనౌన్స్మెంట్ చేయలేదు. సల్మాన్ ఖాన్ ” కీసికా భాయ్ కిసి కి జాన్ ” సినిమాలో చివరిగా మెరిసింది. ఈ సినిమా అట్టర్ ప్లాప్. ప్రస్తుతం పూజాహెగ్డే సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్టార్ హీరోల సరసన నటించిన పూజ హెగ్డే ఆమె ఆటిట్యూడ్ తో అవకాశాలను కోల్పోయి చివరకు సాయిధరమ్ తేజ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని.. చివరకు అంతకంటే చిన్న హీరోల సినిమాలే ఆమెకు దిక్కవుతాయన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.