ఈ ఫోటోలో చిన్న పాప ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో త్రో బ్యాక్ థీమ్‌తో సెలబ్రిటీస్ చిన్నప్ప‌టి ఫొటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అలా ఇప్పుడు పై పాప ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కూల్ యూనిఫాంలో అందరి మధ్యలో నుంచొని క్యూట్ గా నవ్వుతున్న ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె ఓ మలయాళీ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో? ఇప్పటికైనా గుర్తుపట్టారా. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. ” అ ఆ ” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ ‘ శతమానం భవతి ‘ సినిమాతో హీరోయిన్ గా బాగా పాపుల‌ర్ అయ్యింది.

మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తరువాత వరుసగా సినిమాలలో నటించింది. పాన్ ఇండియా మూవీ ‘ కార్తికేయ 2 ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అనుపమ.. ఆ తరువాత రెండు పాన్ ఇండియా లెవెల్ సినిమాలలో నటించి ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘ డిజే టిల్లు స్క్వేర్ ‘ లో హీరోయిన్ గా నటిస్తుంది అనుప‌మ‌.

ఈ సినిమా కాక ఆమె చేతిలో మ‌రో మూడు సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తూ నటించి మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నా అనుపమ టాలీవుడ్ ఇండస్ట్రీపైనే మక్కువ చూపుతుంది.