ఓరి దేవుడోయ్..పెళ్లికి ముందే హీరోయిన్ ఆమ‌నికి భ‌ర్త అన్ని కండీష‌న్లు పెట్టాడా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది సీనియర్ నటి ఆమని. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఆమని.. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైం లోనే ప్రముఖ బిజినెస్ మాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. వివాహక జీవితంలోనికి అడుగుపెట్టిన ఆమని పిల్లల బాధ్యతలను చూసుకుంటూ తన వ్యక్తిగత జీవితంలో బిజీ అయింది.

ఇలా తన కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైంలో ఇండస్ట్రీకి ఆమని దూరం కావడంతో ఫాన్స్ కూడా చాలా ఫీలయ్యారు. తాజాగా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో అమ్మగా, అక్కగా, వదినగా ఇలా క్యారెట్ అర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలను నటిస్తూ బుల్లితెరపై పలు సీరియల్స్‌, షోస్‌లో కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్న ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటిసారిగా తన భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టింది.

ఆమని మాట్లాడుతూ ..”నేను పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావడానికి కారణం నా భర్త పెట్టిన కండిషన్ “అని చెప్పింది. “మేమిద్దరం ప్రేమించే వివాహం చేసుకున్నా.. నా భర్త పెళ్లికి ముందే నేను పెళైన తర్వాత సినిమాల్లో నటించకూడదని కండిషన్ పెట్టాడని.. దానికి ఒప్పుకునే అతను పెళ్లి చేసుకున్నానని ..ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని వివరించింది. ఇప్పుడు ఆలోచిస్తే ఆ కండిషన్‌కి అప్పుడు నేను అసలు ఎలా ఒప్పుకున్నాను” అని సందేహం వస్తుందని.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి నా భర్త నన్ను స్వయంగా ఎంకరేజ్ చేశాడంటూ “వివరించింది.