ఆది పురుష్ ఎఫెక్ట్: రాజమౌళి ఇక ఆ పని చేయడం కష్టమేనా? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న వార్త..!!

రాజమౌళి ఇక మహాభారతం తీయడం కష్టమేనా అంటే, అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలు తీయడంలో ఫిల్మ్ మేకర్స్ కి విపరీతమైన స్వేచ్చ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న విషయాలను బూతద్దంలో చూపిస్తూ వివాదాన్ని రాజేసేందుకు ఇక్కడ ఎప్పుడూ ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా మంది సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి. ముఖ్యంగా పౌరాణికాలు మరియు ఇతిహాస కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది.

Massive : Adipurush teaser out As Prabhas Transforms Into Lord Ram For The  Mythological Epic Based On Ramayana

తాజాగా రిలీజైన ఆదిపురుష్ సినిమానే దానికి ఓ ఉదాహరణ. మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ కు ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాముడిగా ఆయన లుక్ ఏంటి ఇలా ఉంది? ఆ రావణాసురుడి జుట్టేంటి అలా వుంది? ఆంజనేయస్వామి మూతి ఫ్లాట్ గా ఉందేమిటి అనే చాలారకాల విమర్శలు వచ్చాయి. కాగా చాలా మంది ఈ వివాదం విషయంలో స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాకు వస్తున్న ఈ నెగటివ్ టాక్ మరియు ట్రోల్స్ ఇంకా వివాదాల కారణంగా రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను తీసేందుకు ఆసక్తి చూపించడేమో అంటూ కొంతమంది సినిమా పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

It is the aim of my life: SS Rajamouli on his dream project Mahabharat

అవును, రాజమౌళి ఎప్పుడైతే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ అని ఈ ప్రపంచానికి చెప్పాడో అప్పటినుండి సగటు సినిమా ప్రేక్షకులు ఆ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే గత కొంత కాలంగా ఈ మహాభారతం ప్రాజెక్ట్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. మహాభారతం సినిమా ఒకవేళ రాజమౌళి తీయాలని చూస్తే దానికోసం ఎంతగా ప్రయత్నిస్తాడో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమానే బూతద్దంలో చూసి విమర్శించిన కొందరు కుహనా మేధావులు మహాభారతం మొదలు పెడితే వార్వగలరా? అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటన్నింటిని కూడా రాజమౌళి తట్టుకుంటాడు అనేది కొందరి మాట.

SS Rajamouli plans to make film based on Mahabharata : The Tribune India