అర్జున్‌రెడ్డి లాంటి సూపర్ హిట్ మిస్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో…!

అర్జున్ రెడ్డి ఈ సినిమా పేరు చెప్తేనే మనకు తెలియకుండానే మనలో కొన్ని ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. అలాంటి ఒక క్రేజీ రొమాంటిక్ సినిమాగా రికార్డులకెక్కింది. మరీ ముఖ్యంగా యూత్ లో ఈ సినిమా పేరు చెప్తే గూస్ బంప్స్ మోత మోగాల్సిందే. అప్పటివరకు క్లాసిక్ అండ్ కూల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి.

Arjun Reddy Telugu Movie Review | Vijay Deverakonda Arjun Reddy Telugu Movie Review | Arjun Reddy Movie Review | Arjun Reddy Cinema Review | Arjun Reddy Review and Rating | Arjun Reddy

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీలో శాలిని పాండే హీరోయిన్‌గా ఎంతో బోల్డ్ గా నటించింది. ఒక ముద్దు అడిగితే పది ముద్దులు పెట్టే అంతగా ఈ సినిమాతో కుర్రాళ్ళు మతులు చెడగొట్టింది. అంతేకాదు రాహుల్ రామకృష్ణ , సంజయ్ స్వరూప్ , కమల కామరాజు , కాంచన తదితరులు ఇందులో కీలకపాత్ర పోషించి సినిమాకి మంచి హైప్ ఇచ్చారు . భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ రెడ్డి వంగ.. ఈ సినిమా నిర్మించారు.

Sharwanand goes for a lengthy surgery

ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది విజయ్ దేవరకొండని కాదట. ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో అల్లు అర్జున్ అట. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా కోసం ముందుగా అల్లు అర్జున్ అనుకున్నారట. ఆయన్ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథను కూడా రెడీ చేశారట. బోల్డ్‌ కంటెంట్ తో పాటు లిప్ కిస్సులు ఇవ్వాల‌ని డైరెక్టర్ కండిషన్ పెట్టడంతో. అల్లు అర్జున్ తన ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందన్న ఒక రీజన్ తో ఈ సినిమాకి నో చెప్పాడట.

Allu Arjun Knows How to Pinch, Where to Pinch"

ఆ తర్వాత సందీప్ ఈ కథను శర్వానంద్ వద్దకు కూడా తీసుకువెళ్లాడట. అల్లు అర్జున్ చెప్పిన కార‌ణ‌ల‌తోనే శర్వా కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేసారట. దీంతో అప్పుడప్పుడే పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో ఈ సినిమా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట సందీప్. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా వచ్చి ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది.