1995లో మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి హీరోగా మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించిన బొంబాయి సినిమా ఎంత మంచి బ్లాక్ పాస్టర్ హిట్‌గా నిలిచిందా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా బొంబాయి మత కలహాల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఉరికే చిలక తోడు ఉంటాను కడవరకు అనే పాట ఈ సినిమాలోదే.
ఈ పాట ప్రేయసి కోసం ఎదురు చూస్తూ వానలో తడుచుకుంటూ బాధతో పాడుతూ ఉంటాడు హీరో అరవింద్ స్వామి. ఈ పాట ఇప్పటికీ ఎవరి గ్రీన్ హిట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమాకు అప్పట్లో రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ లభించాయి. ఈ సినిమాకు మణిరత్నం ముందుగా చియాన్ విక్రమ్‌ను హీరోగా అనుకున్నారట. అప్పట్లో తెలుగు, తమిళంలో విక్రమ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
విక్రమ్ ఈ సినిమా కథను విని సినిమాకు ఓకే కూడా చెప్పారట .ఈ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్లో కూడా పాల్గొన్న తర్వాత అదే రోజు సాయంత్రం మనిషా కొయిరాల విక్రమ్ తో షూట్ కూడా జరిగిందట. తర్వాత ఈ సినిమాలో చేయడానికి హీరోకి గడ్డం ఉండకూడదని మణిరత్నం చెప్పాడట. అప్పటికే విక్రం వేరే సినిమాలో హీరోగా నటిస్తుండడంతో ఆ సినిమాల్లో తన రోల్ కు గడ్డం అవసరం అనే కారణంతో బొంబాయి సినిమాను ఇష్టం లేకుండానే వదులుకున్నాడట విక్రమ్.
విక్రమ్ – మణి రత్నం దర్శకత్వంలో తాజాగా పోనియన్ సల్వన్ 2 సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో పాల్గొన్న విక్రం స్వయంగా తానే బొంబాయి సినిమాను తప్పక వదులుకోవాల్సి వచ్చిందని.. మణిరత్నం లాంటి వారి దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్క నటుడు కోరుకుంటాడని చెప్పాడు విక్రమ్. ఇకపోతే ఈ సినిమాలో నటించిన అరవింద్ స్వామికి ఈ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది.