ప్రస్తుత వేసవి నుంచి వర్షాకాలంలోనికి అడుగుపెడుతున్నాం. ఎండలు పోయి వానలు పడే సమయంలో వెదర్ చేంజెస్ కారణంగా ఇన్ఫెక్షన్స్, ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి అనారోగ్యాలు భారిన పడకుండా మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి కాలంలో అయినా బీట్‌రూట్ ఉత్తమమైనది. ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌తో తయారు చేసే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పర్ పెరుగుతుంది.
బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. దీన్ని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. బీట్‌రూట్‌లో ఫాలేట్ అధిక పరిణామంలో ఉంటుంది. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడానికి ఎంతో సహకరిస్తుంది. బీట్‌రూట్‌లో ఐరన్ సమృద్ధిగా లభించడంతో పాటు ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ సమస్యలు, రోగనిరోధక శక్తి సమస్యలు ఉన్నవారు ఉపశమనం పొందవచ్చు.
బీట్‌రూట్‌లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా.. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు కూడా బీట్‌రూట్ సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్స్ శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి కీరోల్ ప్లే చేస్తుంది. తరచూ అనారోగ్యానికి గురయ్యే వారు ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చక్కటి రిలీఫ్ వస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో తోడ్పడతాయి.
ఇందులో ఉండే పోలేట్, ఫైబర్ స్కిన్ బ్యూటీ ని మెరుగుపరచడమే కాక దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. బీట్‌రూట్ రసాన్ని రోజు తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు శారీరక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.