ఠాగూర్ ‘ సినిమాతో చిరంజీవి క్రియేట్ చేసిన రేర్ రికార్డ్‌.. అప్ప‌ట్లో ఇండస్ట్రీ ర్యాంప్ ఆడేశాడు…!

టాలీవుడ్ హీరో చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఉన్నాయి . అలాంటి వాటిలో ఠాగూర్ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోవడంతో చిరంజీవి రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోయిన్‌గా శ్రీయ, జ్యోతిక కూడా నటించింది.Amazon.com: Tagore : Chiranjeevi, Jyothika, Shriya Saran, Prakash Raj, A. R. Murugadoss, V. V. Vinayak, B. Madhu: Prime Video

తమిళంలో విజయకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం రమణకు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమా మక్కికి మక్కి దించకుండా ఠాగూర్ సినిమాలో పలుమార్పులు చేశారు.. రూ.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 2003 సెప్టెంబర్ -24 న విడుదలై మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.

దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే దాదాపుగా రూ .27 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొన్న బయ్యర్లకు దాదాపుగా రూ .9 కోట్ల రూపాయలు లాభాలు వ‌చ్చాయి. ఠాగూర్ పేరిట ఇంతవరకు మరే సినిమాకు సాధ్యం కానీ ఒక రికార్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఠాగూర్ సినిమా అప్ప‌ట్లో ఏ తెలుగు సినిమా రిలీజ్ కాన‌న్ని థియేటర్లలో విడుదల అయింది.

Tagore Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

ఈ సినిమా విడుదలైన తర్వాత 50 రోజులలో 253 సెంటర్లలో ఆడగా..100 రోజులు 192 సెంటర్లలో నాన్ స్టాప్ గా ఆడినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సినిమా ఏకంగా ఇన్ని రోజులు అన్ని సెంటర్లలో ఆడనుమంటే అది మామూలు విషయం కాదు. అప్ప‌ట్లో అదో సంచ‌ల‌న రికార్డ్‌. అయితే ఠాగూర్ క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు అప్పటికి ఇప్పటికి మరే తెలుగు సినిమా కూడా బ్రేక్ చేయలేదు.