పెద్ద హిట్ సినిమా… అయినా స్టార్ హీరోయిన్ శ్రీదేవికి ఘోర అవ‌మానం…!

ఆక‌లి రాజ్యం.. ఈ సినిమా ఒక ట్రెండు. ఒక రికార్డు. అప్ప‌టి ప్ర‌భుత్వాలకు పెద్ద క‌నువిప్పు కూడా. నిరుద్యోగం, దేశంలో ఆక‌లి కేక‌లు.. స‌మాజంలో చెడు పోక‌డ‌లు వంటి అనేక అంశాల‌ను స‌మాహారంగా చేసుకుని నిర్మించిన ఈ సినిమా.. అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ కొట్టింది. నిజానికి ఇది సినిమా అనే కాకుండా.. స‌మాజంలో ఉన్న రుగ్మ‌త‌ల‌కు ప‌ట్టిన అద్దంగా పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి.

Aakali Rajyam - Alchetron, The Free Social Encyclopedia

ఇలాంటి సినిమాలో అనేక ప్ర‌త్యేక‌త‌లు వున్నాయి. సినిమా మొత్తాన్ని కూడా.. ఢిల్లీలోనే రూపొందించారు. పైగా అప్ప‌ట్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆ ఎన్నిక‌ల‌ను కూడా సినిమాల్లో చేర్చ‌డం ఒక విశేష‌మైతే.. మ‌రో విశేషం.. ఏమాత్రం బాధ్య‌త లేని తండ్రి.. ఎన్నో బాధ్య‌త‌ల‌ను త‌ల‌పై వేసుకున్న కుమార్తె.. కుల క‌ట్టుబాట్ల‌ను ఎదిరించే విప్ల‌వ యువ‌కుడు.. డ‌బ్బు కోసం అమ్మాయిలు కాదు.. అబ్బాయిలు కూడా అమ్ముడు పోతారు.. అనే పెద్ద సందేశాల‌తో ఈ సినిమా రూపొందింది.

అంతేకాదు.. అక్ర‌మం, అన్యాయం, ఒక‌రిని ఇబ్బంంది పెట్ట‌కుండా.. ఒక‌రిని దోచుకోకుండా ఉండే ఏ వృత్తి అయినా.. స‌మాజంలో మంచిద‌నే భావ‌న‌ను ఈ సినిమా చెబుతుంది. అలాంటి సినిమాలో కీల‌క రోల్స్ పోషించింది.. క‌మ‌ల్‌హాస‌న్‌. శ్రీదేవి. అప్ప‌టికి మంచి ఫామ్‌లో ఉన్న శ్రీదేవి. తొలుత ఈ సినిమాను కాద‌న్నారు. కానీ, మాట‌లు, గీత ర‌చ‌యిత ఆరుద్ర ప‌దే ప‌దే చెప్పి శ్రీదేవిని ఒప్పించారు. ఈ సినిమాలో శ్రీదేవిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు.

Akali Rajyam Telugu Movie Scene - Kamal Hassan , Sridevi - YouTube

క‌మ‌ల్‌హాస‌న్ ఎలాంటి మేక‌ప్ లేకుండా న‌టించిన తొలి చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. శ్రీదేవి అనుకున్న‌ట్టుగానే ఆమె అనుమానం వ్య‌క్తం చేసిన‌ట్టుగానే ఈ సినిమా సందేశం అయితే.. ప్ర‌జ‌ల్లోకి వెల్లింది కానీ.. హీరోయిన్ గా మాత్రం శ్రీదేవికి మార్కులు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో రెండు సంవ‌త్స‌రాలు ఆమె మ‌రోచిత్రం కోసం వేచి చూసింద‌ట‌. ఈ టైంలోనే ఆమె ఎన్నో అవ‌మానాలు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చిదంటారు.