మలయాళ కుట్టి అయినా సుమ తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడగలదో యాంకరింగ్ తో ఎంతమంది అభిమానులను సంపాదించుకుందో అందరికీ తెలుసు. సుమా చేసే టీవీ షో అయిన గేమ్ షో అయినా ప్రి రిలీజ్ ఈవెంట్స్ కి అయినా ఎంతో క్రేజ్ ఉంటుంది. అయితే సుమా లేకుండా తెలుగులో స్టార్ హీరోల ప్రి రిలీజ్ ఈవెంట్స్ అనేది అసలు ఊహించుకోలేము.
ఏ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఉన్నా సరే ముందుగా వినిపించేది సుమనే. ప్రస్తుతం చిన్న సినిమాల హీరోల కూడా తమ సినిమా రిలీజ్ ఈవెంట్స్ కి సుమనే యాంకరింగ్ చేయాలని కోరుకుంటున్నారు. సుమ సినిమాలో భాగమైతే మంచి పబ్లిసిటీ వస్తుందని నమ్మకంతో వారంతా సుమను యాంకర్ గా ఎంచుకుంటున్నారు.
గత 20 సంవత్సరాలుగా సుమ యాంకరింగ్ ఫీల్డ్ లో తిరుగులేకుండా దూసుకుపోతుంది. ఇప్పటికే భారీ రెమ్యూనరేషన్లు సుమ తీసుకుంటుంది అనే వార్తలు చాలాసార్లు వినిపించాయి. టీవీ షోస్ కి ఒక ఎపిసోడ్ కు వచ్చి సుమా లక్ష రూపాయలు… అంతకు పైనే డిమాండ్ చేస్తుందట. అదే ప్రి రిలీజ్ ఈవెంట్స్ అయితే రెండు మూడు లక్షల వరకు సుమా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.
ఇప్పటికే చుక్కలనంటి పోతుంది సుమ రెమ్యునరేషన్. అయితే సుమ రీసెంట్గా తన రెమ్యూనిస్టును మరింత పెంచిందట. అయినా ఇప్పటికి సుమ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇలానే మరి కొన్ని సంవత్సరాలు దూసుకుపోతుందనటంలో సందేహం లేదు.