‘ పుష్ప 2 ‘ లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌… ఇంత స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారేంటి..!

టైటిల్ చూడ‌గానే చాలా మందికి పుష్ప 2 సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడా ? అన్న సందేహాలు క‌లుగుతాయి. ఎన్టీఆర్ – బ‌న్నీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్‌. వీరిద్ద‌రూ బావ‌, బావ అని ఎంతో అప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. అటు పుష్ప 2 డైరెక్ట‌ర్ సుకుమార్ ఇద్ద‌రు హీరోల‌కు కావాల్సినోడు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌తో ఏదైనా గెస్ట్ రోల్ పుష్ప 2లో వేయిస్తున్నాడా ? అన్న డౌట్లు వ‌స్తాయి.

అయితే అస‌లు మ్యాట‌ర్ అది కాదు. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా పుష్ప 2 షూటింగ్ జ‌రుగుతున్న సెట్స్‌లోకి వెళ్లాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన పుష్ప సెట్‌ ఎన్టీఆర్ సందర్శించారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే త‌న షూటింగ్ ముగిసిన వెంట‌నే ఎన్టీఆర్ ప‌క్క‌నే ఉన్న బ‌న్నీ పుష్ప 2 సెట్లోకి వెళ్లి కాసేపు స‌ర‌దాగా గ‌డిపాడు.

దీంతో అక్క‌డున్న పుష్ప 2 మేక‌ర్స్‌తో పాటు యూనిట్ స‌భ్యులు అంద‌రూ హ్యాపీ ఫీల‌య్యారు. అక్క‌డ‌కు ఎన్టీఆర్ రావ‌డం పుష్ప 2 టీంకు మంచి ఎన‌ర్జీ ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఇక పుష్ప 2 సినిమాతో పాటు ఎన్టీఆర్ 30వ సినిమా రెండూ కూడా వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. పుష్ప పాన్ ఇండియా లెవ‌ల్లో సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి.