ఈ 4 గురు స్టార్ హీరోల ఆస్తుల విలువ ఎంతెంతో తెలుసా… ఎవ‌రు టాప్‌.. ఎవ‌రు లీస్ట్‌…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతున్నా సరే వయసుతో సంబంధం లేకుండా ఇంకా అదే క్రేజ్ తో దూసుకుపోతున్నారు చాలామంది స్టార్ హీరోస్. ఒకరిని మించి మరొకరు రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమాల్లో కొనసాగుతున్న ఈ స్టార్ హీరోస్ లో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నార‌నేది అనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఒకసారి ఏ హీరోకి ఎంతెంత‌ ఆస్తి ఉందో తెలుసుకుందాం..

Chiranjeevi Wishes His Family To Be Like Kapoors In South!

మెగాస్టార్ :
చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఏడు ప‌దుల వ‌య‌స్సుకు ద‌గ్గ‌ర అవుతున్నా చిరంజీవి ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన బోలా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 150 సినిమాలకు పైగా నటించిన మెగాస్టార్ సినిమాలతో పాటు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ విధంగా చిరంజీవి దాదాపు 8 వేల కోట్లకు పైగా ఆస్తిని కూడపెట్టారని తెలుస్తుంది.

Nagarjuna to go on a sabbatical after The Ghost. Here's why - India Today

నాగార్జున :
అక్కినేని నాగేశ్వరరావు వారసుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఏఎన్నార్ సంపాదించిన ఆస్తులు కాకుండా నాగార్జున తన సొంతంగా చాలా ఆస్తులు కూడపెట్టాడట. నాగార్జున సినిమాలతో పాటు చాలా వ్యాపారాలు కూడా చేస్తున్నాడు అనే విషయం చాలామందికి తెలుసు. ఆయన సినిమాల్లోనే కాక బిజినెస్ మాన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రు. 12 వేల కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది.

Balakrishna: ప్రయోగం చేయబోతున్న బాలయ్య | Balakrishna new experiment with  director Venkatesh Maha

బాలకృష్ణ :
నందమూరి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఇప్పటికీ సినిమాలో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నారు. ఇటీవల రిలీజ్ అయిన అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో మరి కాస్త క్రేజ్ ను సంపాదించుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలుసు. బాలకృష్ణకు రు. 4 – 5 వంద‌ల‌ కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్టు అంచనా.

Venky clears ways for Balakrishna

వెంకటేష్ :
రామానాయుడు వారసుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ కుటుంబ నేపథ్యంలో వచ్చిన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన చేసిన అన్ని సినిమాలు దాదాపు హిట్ గానే నిలిచాయి. ఇటీవల రానా తో పాటు కలిసి వెంకటేష్ నటించిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ విమర్శలకు గురైనప్పటికీ ఓటిటిలో అధిక వ్యూవర్స్ ఉన్న రికార్డును కొల్లగొట్టింది. వెంకటేష్ కు సినిమాలు, బిజినెస్ ల్లో సంపాదించిన ఆస్తులు రు. 6 వేల కోట్ల వరకు ఉండవచ్చు. రామానాయుడు ద్వారా వ‌చ్చిన ఆస్తుల విలువే చాలా ఎక్కువుగా ఉంటుంది.