సాధారణంగా ఏసినిమా అయినా.. హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది. హీరో తర్వాత వారికే అగ్రతాంబూ లం ఇస్తారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే.. హీరోయిన్ల కంటే కూడా.. అత్యధిక ప్రాధాన్యం దక్కించుకున్న ఏకైక నటీమణి.. ఎస్. వరలక్ష్మి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో హీరోయిన్‌గా నటించిన ఎస్. వర లక్ష్మి.. తర్వాత కాలంలో క్యారెక్టర్ పాత్రల్లో నటించారు.
తల్లిగా, చెల్లిగా, అమ్మమ్మగా కూడా అనేక సినిమాల్లో నటించారు. బాలభారతం సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టు గా ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రీకృష్ణ పాండవీయంలో కుంతీదేవిగా ఆమె నటన అద్భుతం అని అనిపించు కుంది. ఇలా.. తనకంటూ.. ప్రత్యేకతను చాటుకున్న ఎస్. వరలక్ష్మి.. కూడా..గాయకురాలు, సంగీత దర్శ కురాలు. తన సినిమాల్లో ఒక్కపాటైనా ఉండాలనే తత్వం ఉన్నవారు.
అయితే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తొలిసినిమా బాల భారతంలో ఎస్. వరలక్ష్మిని.. బలవంతంగా ఒప్పించారు. ఈ క్రమంలోనే హీరోయిన్‌తో సమానంగా (ఆ సినిమాలో హీరోయిన్లు లేరు) పారితోషికం ఇస్తానని చెప్పిన ఒప్పించారు. ఇక, అప్పటి నుంచి ఏసినిమాలో నటించినా.. హీరోయిన్‌తో సమానంగానే ఎస్. వరలక్ష్మి పారితోషికం తీసుకున్నారు.
తర్వాత.. తర్వాత.. కొంత మొత్తం తగ్గించినా.. దాదాపు హీరోయిన్‌తో సమానంగానే పారితోషికం తీసుకు న్నారు. ఇలా.. ఎస్. వరలక్ష్మి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆర్థికంగా బలమైన జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన ఎస్. వరలక్ష్మి.. అనేక దానధర్మాలు చేశారు. ఆమెకు రాజకీయాలంటే ఇష్టం. దీంతో జయలలిత కు ఆమె సలహాదారుగా కొన్నాళ్లపాటు వ్యవహరించారు కూడా..!