వైఎస్ వివేకా హత్య కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలిసిందే..ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. అలాగే కడప ఎంపీ, జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అవైనాష్ రాజకీయ జీవితానికి ఇంకా ఫుల్ స్టాప్ పడినట్లే అని టిడిపి శ్రేణులు అంటున్నాయి.
గత ఎన్నికల్లో వివేకా హత్య చంద్రబాబు, టిడిపి నేతలు చేశారని అబద్దపు ప్రచారం చేసి వైసీపీ లబ్ది పొందిదని..ఇప్పుడు అదే అంశం వైసీపీని ఓటమి దిశగా తీసుకెళుతుందని టిడిపి నేతలు అంటున్నారు. ఈ క్రమంలో ఈ సారి కడప ఎంపీ సీటులో వైసీపీ ఓడిపోతుందని, టిడిపి గెలవబోతుందని అంటున్నారు. అంటే వివేకా కేసుతోనే ఇదంతా జరుగుతుందని చెబుతున్నారు.
అయితే కేసు పరంగా ఏమైనా జరగని గాని.. రాజకీయంగా అది కడపలో వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతుంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఎలాంటి పరిస్తితుల్లోనైనా కడప ప్రజలు వైసీపీ వైపే ఉంటారు. అందులో కడప ఎంపీ సీటుని గెలవడం అనేది సాధ్యమయ్యే పని కాదు.
అసలు ఇక్కడ టిడిపి గెలిచింది ఒక్కసారి 1984లోనే గెలిచింది. మళ్ళీ ఎప్పుడు అక్కడ గెలవలేదు. గత ఎన్నికల్లో దాదాపు 3 లక్షల ఓట్ల పైనే మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఇప్పటికీ అక్కడ వైసీపీకే ఆధిక్యం ఉంది. వివేకా కేసు ఏమి రాజకీయంగా కడపలో వైసీపీ ఓటమిని డిసైడ్ చేయదనే చెప్పాలి.
కడప పార్లమెంట్ పరిధిలో బద్వేలు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ప్రొద్దుటూరు, మైదుకూరు మినహా మిగిలిన స్థానాల్లో వైసీపీకే ఆధిక్యం ఉంది..కాబట్టి కడప ఎంపీ సీటుని టిడిపి గెలవడం అసాధ్యం.. ఇక్కడ పసుపు జెండా ఎగరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి.