నిధి అగర్వాల్.. హైదరాబాద్లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ బెంగళూరులోనే తన విద్యాభ్యాసం అంత పూర్తి చేసింది. అంతేకాకుండా కథక్, బెల్లీ డాన్స్ లో కూడా ఈమె ట్రైనింగ్ తీసుకుంది. ఈమె బాలీవుడ్, టాలీవుడ్, కోలి వుడ్ లో కూడా అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నిధి. 2018లో సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఈ సినిమా హిట్ అవ్వకపోయినా తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అయినా ఆమెకు ఛాన్సులు రాకపోవడంతో స్టార్ డం సంపాదించుకోలేకపోయింది నిధి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది నిధి. ఈ సినిమా పట్టాలెక్కి రెండు, మూడు సంవత్సరాలు అవుతున్న ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.
ఇటీవలసోషల్ మీడియాలో చాలామంది నటీ, నటులు క్యాస్టింగ్ కౌచ్ లో తమకు ఎదురైనా అనుభవాలు పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె అనుభవం పంచుకుంది. కాస్టింగ్ కౌచ్ ప్రతి చోట ఉంటుందని.. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనకు కూడా ఈ అనుభవం ఎదురైందని చెప్పింది.
తన కెరీర్ స్టార్టింగ్ లో బాలీవుడ్ లో ఒక బడా డైరెక్టర్ ఆడిషన్స్ కు పిలిచి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించమని అడిగాడని.. నీ ప్రైవేట్ పార్ట్స్ పెద్దగా ఉంటేనే ఆఫర్లు వస్తాయంటూ అసభ్యకరంగా మాట్లాడాడని.. దాంతో చిరాకుతో అక్కడి నుంచి వచ్చేశానని నిధి చెప్పింది. ప్రస్తుతం నిధి కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.