అద్గది.. మన ఎన్టీఆర్ రేంజ్ అంటే అలా ఉండాలి.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కే చెమటలు పట్టించాడుగా.. శభాష్ తారక్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “నిన్ను చూడాలని” సినిమాలో నటించిన ఎన్టీఆర్ నటన నిన్నకాక మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటన కంపేర్ చేస్తే ఎన్టీఆర్ ఎంతలా ఎదిగిపోయాడో మనకే తెలిసిపోతుంది . అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే ఎన్టీఆర్ 31 సినిమాలో కూడా నటించబోతున్నాడు .

Watch RRR Full HD Movie Online on ZEE5

కాగా ఇలాంటి క్రమంలోనే గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమాను డైరెక్ట్ చేయాలని గ్లోబల్ హాలీవుడ్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం మన తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం అని చెప్పాలి . ఇప్పటివరకు ఇలాంటి అరుదైన ఘనత అందుకున్న తెలుగు నటులు లేరనే చెప్పాలి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ తో సినిమా తీయాలి అంటూ హాలీవుడ్ డైరెక్టర్ లు ఆయనకు కాల్ చేసి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉండడం ఎన్టీఆర్ లోని స్పెషల్ టాలెంట్ మనం అర్థం చేసుకోవచ్చు .

Bheem For Ramaraju - Ramaraju Intro - RRR(Telugu) | NTR, Ram Charan, Ajay Devgn | SS Rajamouli - YouTube

కాగా రీసెంట్గా అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ గన్ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఎన్నో మంచి మంచి సినిమాలు తెరకెక్కించి హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న జేమ్స్ గన్..రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ను ఓ రేంజ్ లో పొగిడేసారు . అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయానని ..కచ్చితంగా ఆయనతో సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

“గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ” లాంటి బిగ్గెస్ట్ హిట్ మూవీ డైరెక్టర్ చేసిన జేమ్స్ గన్ ఎన్టీఆర్ లాంటి హీరోను డైరెక్ట్ చేయాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకు రావడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో . మన ఎన్టీఆర్ టాలెంట్ ప్రపంచ దేశాలకు ఎలా పాకిపోయిందో ..ఒకటి మాత్రం నిజం ఎన్టీఆర్ హాలీవుడ్ లో అడుగుపెడితే మాత్రం రికార్డులు తిరగరాసే విధంగా సినీ లెక్కలు మారిపోవాల్సిందే అంటున్నారు నందమూరి అభిమానులు . ప్రజెంట్ ఈ న్యూస్ ని నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు..!!