కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు ప్రభాస్. వర్షం, ఛత్రపతి సినిమాల ద్వారా సూపర్ హిట్ కొట్టి స్టార్ డంను సంపాదించుకున్నారు. ఆ తర్వాత మిర్చి సినిమాతో మాస్లో తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. 2015లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన బాహుబలి 1 సినిమా ద్వారా ఆయన పాన్ ఇండియా హీరోగా మారాడు. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ఆయన తీసిన అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన సాహూ, రాధే శ్యామ్ డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా షూట్లలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు కే, సల్లార్, అదిపురుష్ సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా పోస్టర్లు రిలీజ్ అయి మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి.
ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. కొంతమంది మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలో ప్రభాస్ మొదటివాడు. ప్రభాస్ ఒక్క సినిమాకు రు. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ప్రభాస్ సినిమాల ద్వారా కొన్ని కోట్ల ఆస్తులను కూడబెట్టిన విషయం అందరికీ తెలుసు.
అయితే ప్రభాస్‌కు ఆయన తాతల నుంచి వచ్చిన ఆస్తులు కూడా చాలా ఉన్నాయట. ప్రభాస్ కుటుంబానికి సన్నిహితుడైన ఆర్టిస్ట్ నాగరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ కు దాదాపు రు. 1000 కోట్లకు పైగానే ఆస్తులు ఉంటాయని చెప్పారు. ప్రభాస్ సన్నిహితులు అయిన యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ఇటు థియేటర్ల బిజినెస్, అటు థియేటర్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్లలో భారీ పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో చాలా వరకు ప్రభాస్ ఆస్తులే అని టాక్ ?