‘ యువ‌గ‌ళం ‘ కు గ్రామాల్లో ఇంత క్రేజా… లోకేష్ అప్పుడే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడే..!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం యువ‌గ‌ళం. నిజానికి 40 సంవ‌త్స‌రాల టీడీపీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కూడా.. పాద‌యాత్ర చేప‌ట్ట‌లేదు. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన‌ప్పుడు చైత‌న్య ర‌థం పేరుతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రతి జిల్లాను ప‌ర్య‌టించారు. త‌ద్వారా అన్న‌గారు.. స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల‌ను జాగృతం చేశారు.

Yuva Galam Padayatra: TDP National Secretary Nara Lokesh Interacts With  Farmers - PICS

ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ చంద్ర‌బాబు హ‌యాంలో కేవ‌లం బ‌స్సు యాత్ర‌ల‌కే ఆయ‌న ప‌రిమితం అయ్యారు. అయితే.. ఎవ‌రూ కూడా పాద‌యాత్ర చేయ‌లేదు. చంద్ర‌బాబు వ‌స్తున్నా మీకోసం పాద‌యాత్ర చేసినా.. అది బ‌స్సు-న‌డ‌క రెండూ క‌లిపి చేయ‌డం గ‌మ‌నార్హం. పైగా ఇంతగా 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని ల‌క్ష్యంగా పెట్టుకోలేదు. కానీ, నారా లోకేష్ మాత్రం మూడు ప‌దుల వ‌య‌సులోనే భారీ ల‌క్ష్యం 4000 కిలో మీట‌ర్ల దూరం యువ‌గ‌ళం నిర్ణ‌యించుకున్నారు.

Muhurtham Fixed For Nara Lokesh Padayatra

దీని ద్వారా పార్టీ వైపు యువ‌త‌ను ఆక‌ర్షించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే యువ‌త ను ప్ర‌ధానంగా చేసుకుని పాద‌యాత్ర నుకొన‌సాగిస్తున్నారు. అయితే.. అంత‌ర్లీనంగా.. దీంతో పాటు.. మ‌రో విష‌యం కూడా ఉంది. త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకోవాల‌నే ల‌క్ష్యం కూడా నారా లోకేష్ నిర్ణ‌యించుకు న్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌లేదు.

మొదటి రోజే లోకేష్ యువగళం సూపర్ హిట్.. | Lokesh Yuvagalam Gets Positive  Response Details, Nandamuri Balakrishna, Nara Lokesh, Taraka Ratna, Tdp, Ys  Jagan, Yuvagalam, Nara Lokesh Yuva Galam, Chandrababu Naidu, Nara Lokesh ...

కేవ‌లం మ‌ధ్య‌లో 2017లో ఎమ్మెల్సీ అయి.. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. దీంతో కొంత మేర‌కు న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల వ‌ర‌కు నారా లోకేష్ ప‌రిచ‌యం అయ్యారు. కానీ ఎన్నిక‌ల్లో కీల‌క మైన గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు నారా లోకేష్ అంటే ఎవ‌రో తెలిసే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోయారు. అందుకే యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా.. నారా లోకేష్ ఈ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే యాత్ర సీమ జిల్లాల్లో పూర్త‌వ్వ‌కుండానే గ్రామాల్లో తిరుగులేని క్రేజ్ వ‌స్తోంది. లోకేష్ అనుకున్న ల‌క్ష్యం సాధించే దిశ‌గా వెళుతున్నాడు.

Chittoor: సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం | Selfie with Lokesh Programme  Chittoor anr

ఈ క్ర‌మంలోనే యాత్ర మార్గంలో రైతుల‌ను, మ‌హిళ‌ల‌ను అవ్వ‌ల‌ను.. తాత‌ల‌ను ఆయ‌న ప్ర‌ధానంగా స్పృశిస్తున్నారు. మొత్తంగా.. యువ‌గ‌ళంపై నారా లోకేష్ ముద్ర అయితే ప‌డింది. ప్ర‌జానాయ‌కుడిగా ఆయ‌న ఏ రేంజ్‌లో ఎదుగుతున్నారు ? అనేది తేలాలంటే యాత్ర పూర్తి కావాల్సిందే అంటున్నారు ప‌రిశీల‌కులు.