వైసీపీలో ఎంపీ వ‌ర్సెస్ మంత్రి… గోదారి జిల్లాల్లో టిక్కెట్ ర‌చ్చ‌..!

వారిద్దరూ అధికార వైసీపీకి చెందిన నేతలే ఇద్దరు కీలక పదవుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గు మంటుంది ఆ ఇద్దరు ఎవరో కాదు అమలాపురం ఎంపీ చింతా అనూరాధ. మరొకరు మంత్రి పినిపే విశ్వరూప్‌. తాజాగా వైసిపి ఎస్సి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ అనురాధ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఏవి ఎస్సీలకు పెద్దగా అందటం లేదని సంచలన కామెంట్లు చేశారు.

Andhra Pradesh Minister P Vishwaroop Resigns - Sakshi

 

నిజంగా ఇది పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సమావేశం. ఆమె వ్యాఖ్యల పట్ల పార్టీ లోపల బయట కూడా రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. అయితే సొంత జిల్లాకు చెందిన ఎంపీ చేసిన కామెంట్లను మంత్రి ఖండించారు. ఏపీలో ఎస్సీలకు రు. 52 వేల కోట్ల రూపాయల పైచిలుకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. వారికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు.

ఒక ఎంపీగా ఆమె అవగాహన లేక మాట్లాడారా ? లేదా ఏంటి అన్నది తనకు అర్థం కావడంలేదని అన్నారు. ప్రతి ఒక్కరు ఖండించాలని కూడా విశ్వ‌రూప్‌ చెప్పినట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే ఎంపీకి, మంత్రికి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. రాజకీయంగా కోనసీమ జిల్లాలో ఆధిపత్యం కోసమే ఇద్దరు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి అనురాధ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోని అమలాపురం లేదా రాజోలు నియోజకవర్గాలలో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయాలని ఆమె చూస్తున్నారు. అయితే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తన రాజకీయ అధిపత్యానికి ఎక్కడ చెక్‌ పడుతుందో అని భావిస్తున్న మంత్రి విశ్వరూప్ ఆమెకు ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తాజాగా అనురాధ చేసిన వ్యాఖ్య‌లపై ఆయన తన అసంతృప్తి, అసహనం వ్య‌క్తం చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎంపీ వర్సెస్ మంత్రి రచ్చ ఇప్పుడు కోనసీమ జిల్లాలో పెద్ద హాట్‌ టాపిక్ గా మారింది.