టీడీపీలోకి వైఎస్‌. సునీత‌.. ఆ మూడు సీట్ల‌లో ఎక్క‌డ‌ పోటీ అంటూ పోస్ట‌ర్ల క‌ల‌క‌లం…!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిన్నాన్న కుమార్తె సోదరి డాక్టర్ నర్రెడ్డి సునీత గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. తన తండ్రి మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సునీత అలుపెరగని పోరాటం చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. ఆమె చేసిన పోరాటంతోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కేసులో ఆమె ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కి అవినాష్ రెడ్డికి వచ్చిన బెయిల్ వారెంట్ పై పెద్ద పోరాటం చేశారు. తాజాగా ఆమె రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సునీత పొలిటికల్ ఎంట్రీ పోస్టర్లు గోడలపై కనిపించడం.. ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో సెగలు రేపుతోంది. డాక్టర్ సునీత టిడిపిలో చేరినట్టుగా ఆ పార్టీ నేతలతో కలిసి ఆమె ఫోటో ఉండటం విశేషం. జై తెలుగుదేశం నినాదంతో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్లలో సునీతతో పాటు ఆమె తండ్రి వివేకానంద రెడ్డి – భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.

అలాగే చంద్రబాబు నాయుడు, అచ్చెం నాయుడు, లోకేష్ తో పాటు కడప జిల్లా టిడిపి నేతలు ఆర్ శ్రీనివాసులు రెడ్డి – బీటెక్ రవి కూడా ఈ పోస్టర్లలో ఉన్నారు. రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్న వైఎస్ సునీతమ్మ గారికి స్వాగతం.. సుస్వాగతం అంటూ ఆహ్వానం పలుకుతూ ప్రొద్దుటూరులో ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. కడప జిల్లాలో వైయస్ సునీత టిడిపి తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

టీడీపీలోకి వివేకా కూతురు.. సిగ్గు చేటు | Ys Sunitha Reddy Political Entry Soon , Ap Politics , Ys Sunitha Reddy , Ysr , Tdp, Ycp , Kadapa , Chandrababu Naidu , Y. S.

ఈ నేపథ్యంలోనే సునీతకు ఆహ్వానం పలుకుతూ టిడిపి తరఫున పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉంటే సునీత వచ్చే ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ లేదా కడప లోక్‌స‌భ లేదా ప్రొద్దుటూరు అసెంబ్లీ బరిలో ఎక్కడో ? ఒకచోట పోటీ చేస్తారని కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా సునీత టిడిపిలోకి వెళితే అది వైయస్ జగన్‌కు రాజకీయంగా సొంత జిల్లాలోని పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.