సినిమా ఇండస్ట్రీలో ..వెబ్ మీడియాలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విరుపాక్ష సినిమాకు సంబంధించిన టాక్ నే వైరల్ గా మారింది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏప్రిల్ 21 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ను అందుకోవడమే కాకుండా హీరో సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్స్ నెలకొల్పిన సినిమాగా సంచలనాన్ని సృష్టించింది .
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కన్నా సంయుక్త పాత్ర ఎక్కువగా ఉంది అని.. నటన పరంగా ఆమె టూ గుడ్ అంటూ ఈ సినిమానే ప్రూవ్ చేసింది అని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు మలయాళీ బ్యూటీ అయిన సంయుక్తా మీనన్ ఇంత పెద్ద ఆఫర్ ని దక్కించుకోవడానికి మెయిన్ రీజన్ త్రివిక్రమ్ అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే గత కొంతకాలంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకు సంయుక్తా మీనన్ కు మధ్య ఏదో తెలియని స్పెషల్ బాండింగ్ ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై ఇప్పటివరకు సంయుక్త మీనన్ – త్రివిక్రమ్ స్పందించనేలేదు . కానీ విరుపాక్ష సినిమాలో అమ్మడుకు అవకాశం రావడానికి కారణం మాత్రం త్రివిక్రమ్ అని బల్ల గుద్ది చెపుతున్నారు ఫ్యాన్స్ .. ఆయన అండదండల్య్ లేకపోతే సంయుక్త ఇలాంటి ఆఫర్ ని పట్టేదే కాదు అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో మరీ ముఖ్యంగా సంయుక్తని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఆమె కళ్ళే అంటూ తెలుస్తుంది .
ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలాంటిదో మనందరికీ తెలిసిందే .. చాలా భయంకరంగా క్షుద్ర పూజలు చేసే క్యారెక్టర్. ఇలాంటి టైం లో ఆమె కొంచెం భయంకరంగా కనిపిస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు. అంటే కళ్ళతోనే కథను నడిపించాలి అని మాట. ఆ విషయంలో ఫుల్ గా సక్సెస్ అయ్యింది సంయుక్త . ఈ క్రమంలోని ఆమె రెండు కళ్ళు పెద్దగా ఉండడంతోనే ఈ ఆఫర్ దక్కించుకుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేనా ఇలాంటి కథను రాసిన సుకుమార్ ని ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు జనాలు..!!