ఎస్ ఇప్పుడు గుంటూరు జిల్లా టిడిపిలో ఇదే విషయం తరచూ చర్చకు వస్తోంది. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. గత ఏడాదిన్నర కాలంగా శ్రీదేవికి వైసిపి అధినేతకు మధ్య పెద్ద గ్యాప్ వచ్చేసింది. తాను ఎమ్మెల్యేగా ఉండగానే తన నియోజకవర్గంలో ఇన్చార్జిలుగా వేరేవాళ్లను నియమించారని శ్రీదేవి తీవ్రమైన అసంతృప్తితో ఉంటున్నారు.
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆమె వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసిందన్న కారణంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి బయటకు వచ్చాక ఆ పార్టీ అధినేత జగన్ తో పాటు వైసిపి నాయకత్వాన్ని టార్గెట్గా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇక శ్రీదేవి త్వరలోనే టిడిపి గూటికి చేరిపోతారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవంగా చూస్తే శ్రీదేవికి తాడికొండలో తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది.
మరి ఇప్పుడు చంద్రబాబును ఆమెను పార్టీలో చేర్చుకుంటే ఎలాంటి ? హామీ ఇచ్చారు ఆమె చంద్రబాబు నుంచి ఏ హామీ ? తీసుకుని టిడిపిలో చేరుతారు అన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీదేవికి తాడికొండ పక్కనే ఉన్న ప్రతిపాడు సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు సీటు ఇస్తే తన ఎన్నికల ఖర్చు అంత తానే భరించుకుంటానని కూడా శ్రీదేవి చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది.
ఆ హామీ తోనే ఆమె టిడిపిలో చేరడంతో పాటు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేసిందన్న కూడా గుసగస్తులు వినిపిస్తున్నాయి. తాడికొండలో ఇప్పటికే టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన పార్టీకి ఎంతో నమ్మకంతో పనిచేస్తున్నారు. అలాగే ఆయన గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
అందుకే శ్రీదేవికి పక్కనే ఉన్న ప్రతిపాడు సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం ఏంటన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే శ్రీదేవి మాత్రం తాను వచ్చే ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేయటం పక్కా అని తన అనుచరులతో చెబుతున్నట్టు తెలుస్తోంది.