వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఏ ముహూర్తాన తెలంగాణలో పార్టీ పెట్టిందో గాని అప్పటి నుంచి ఆమెకు కాలం ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఆమె ఏం చేసినా రివర్స్‌లో తన్నుతోంది. తాజాగా ఆమె నిరుద్యోగ నిరసన కోసం చేసిన హడావిడి మొత్తం పరువు తీసేసింది. షర్మిల ఈ నిరసన కోసం లోటస్ పాండ్ లో తన ఇంటి నుంచి కారులో బయలుదేరింది. ఆమె కారును కొంత మంది పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కదలడానికి వీల్లేదని చెప్పారు.
ఆమెను వెనక్కు వెళ్లిపోమని సూచించారు. వెంటనే చిర్రెత్తుకొచ్చిన షర్మిల లేడీ కానిస్టేబుల్స్‌ను పక్కకు తోసేశారు. కారు తాళం తీసుకునేందుకు ట్రై చేసిన ఎస్సైను కూడా ఓ తోపు తోశారు. మీకు ఏం అధికారం ఉందని నన్ను ఆపారు అంటూ వీరంగం చేసేశారు. మీకు పని పాట లేకపోతే వెళ్లి గాడిదలను కాసుకోండని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసలు ఆమె ఏం మాట్లాడుతున్నానో అన్న సోయ లేకుండా మాట్లాడినట్టు ఉన్నారు. ఆమె ఎప్పుడు అయితే గాడిదలను కాసుకోమని చెప్పారో వెంటనే ఎస్సై ఇప్పుడు అదే పని చేస్తున్నాం అంటూ కౌంటర్ ఇచ్చారు. అంటే షర్మిలను సదరు ఎస్సై పరోక్షంగా గాడిద అన్నాడన్న విషయం ఈ ఒక్క కౌంటర్‌తో వైరల్ అవుతోంది. అన్నట్టు ఈ మధ్యన షర్మిల మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతుండడంతో పాటు బాగా ట్రోలింగ్‌కు కూడా గురవుతున్నాయి. ఆమె ప్రసంగాల్లో పరిపక్వత కూడా లేదు.