టీడీపీలో పవన్ పై చేయి… ఈ సారి డ్యాన్ షూర్ విక్ట‌రీ..!

అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట..అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటలోనే టి‌డి‌పికి చావుదెబ్బ తగిలింది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ సీట్లలో చిత్తుగా ఓడింది. అలాగే గెలుస్తారనుకున్న నేతలు కూడా ఓడిపోయారు. ఇక అలా ఓటమి పాలైన నేతలు ఈ సారి గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే జేసీ ఫ్యామిలీ నుంచి ఇద్దరు వారసులు పోటీ చేసి ఓడిపోయారు.

JC Pavan Reddy Archives - OlivePosts

జేసీ దివాకర్ తనయుడు పవన్, జే‌సి ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అస్మిత్ తాడిపత్రిలో పోటీ చేసి ఓడిపోగా, పవన్..అనంత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా ఇద్దరు వారసులు మళ్ళీ బరిలో దిగుతున్నారు. అస్మిత్ తాడిపత్రి నుంచి పోటీ చేయడం ఖాయం..అలాగే ఆయన గెలుపు కూడా ఈ సారి సులువు అని తెలుస్తోంది. ఇటు పవన్ మళ్ళీ అనంత ఎంపీగా పోటీ చేయనున్నారు.

ఈ సారి అక్కడ పవన్ కు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. దాదాపు లక్షా 40 వేల ఓట్ల మెజారిటీతో పవన్ ఓడిపోయారు. వైసీపీ నుంచి తలారి రంగయ్య గెలిచారు. అయితే ఆయన ఎంపీగా చేసిందేమి లేదు. దీంతో ఆయనపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పవన్ బలపడుతున్నారు. ఆయనకు పట్టు పెరిగింది. ఇప్పటికే అనంత పరిధిలో టి‌డి‌పి గాలి వీస్తుంది.

J.C. Asmith Reddy Biography, Family, Education, and Career

అనంత పార్లమెంట్ పరిధిలో రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంత అర్బన్, తాడిపత్రి , ఉరవకొండ, గుంతకల్ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో టి‌డి‌పి ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో ఒక్క గుంతకల్ మినహా మిగిలిన సీట్లలో టి‌డి‌పికి పట్టు పెరిగింది. దీంతో ఈ సారి అనంత పార్లమెంట్ సీటుని టి‌డి‌పి సులువుగా కైవసం చేసుకుంటుంది. ఇటు పవన్ గెలవడం ఖాయమని చెప్పవచ్చు.