ఎస్ ఇప్పుడు టిడిపిలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారుతుంది. 2024 ఎన్నికలవేళ టిడిపి నుంచి పోటీ చేసేందుకు చాలామంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో టిడిపి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
టిడిపి గెలుపు పై ఆశలు పెట్టుకున్న చాలామంది ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ సాధించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే పార్టీ యువనేత, మాజీ మంత్రి.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. లోకేష్ చాలా నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు ? పోటీ చేస్తారో క్లారిటీ ఇస్తున్నారు.
విచిత్రం ఏంటంటే చంద్రబాబు కూడా ఇప్పటివరకు ఓపెన్ గా చాలా తక్కువ మంది అభ్యర్థుల పేర్లనే ప్రకటిస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం చాలా నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు ? పోటీ చేస్తారు అన్నదానిపై స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఆ నియోజకవర్గాలలో పేర్లు ప్రకటించిన నేతల్లో సరికొత్త ఉత్సాహానికి కారణం అవుతుంది.
ఇక పార్టీ నేతల అంతర్గత చ ర్చల్లోనూ చంద్రబాబు కంటే లోకేష్ చెప్పిన మాట ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉందని.. 2024 ఎన్నికలలో పలు నియోజకవర్గాలలో లోకేష్ సీట్ల ఎంపికలో.. అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంలో కీలకం కానున్నారన్న గుసగుసలు అయితే పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి.