మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ 2021 లో ఆయన యాక్సిడెంట్ కి గురి కావడం వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.. కానీ ఎలాగోలా నిన్న సినిమాను రిలీజ్ చేశారు. సినిమా ఆలస్యంగా వచ్చిన సరే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు మొదటి రోజు కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు జరిగిన ప్రీ బుకింగ్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా మంచి జోరుని చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుందని చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 40% ఆక్యుపై సొంతం చేసుకున్నట్లు సమాచారం . ఇక ఆన్లైన్ టికెట్ సేల్స్ ద్వారా ఈ సినిమాకు భారీ గా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియా ల వైజ్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
నైజాం – రూ.1.82 కోట్లు
వైజాగ్ – రూ. 58 లక్షలు
సీడెడ్ – రూ.54 లక్షలు
గుంటూరు – రూ.46లక్షలు
నెల్లూరు – రూ.20లక్షలు
కృష్ణ – రూ.32లక్షలు
వెస్ట్ – రూ.47లక్షలు
ఈస్ట్ – రూ.40లక్షలు
మొత్తం – రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని రూ. 4.79 కోట్లు మేరా షేర్ రాబట్టినట్లు సమాచారం. ప్రీ బుకింగ్స్ లో కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ.5 కోట్లలోపు కలెక్షన్స్ వసూలు చేసి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక తదుపరి రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.