టీడీపీ అధినేత చంద్రబాబు జీవితం గురించి చాలా ఎక్కువ మంది అంతా తెలుసునని అనుకుంటారు. కానీ, అందరికీ తెలియని అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితమే చాలా మందికి తెలుసు. కానీ, ఆయనకు ఆరోగ్య రీత్యా సంక్రమించిన వ్యాధిని జయిస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కుటుంబ పరంగా ఒకానొక దశలో ఒంటరి అయిపోయారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నప్పుడు.. ఆయన ఆస్థిని చూసి.. పదవులు చూసి వివాహం చేసుకున్నారనే వాదనను కాంగ్రెస్‌నేతలు చెప్పుకొచ్చారు. దీనినే ఎక్కువగా ప్రచారం చేశారు. దీంతో చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి రూపాయి కూడా తీసుకోకుండా.. తన కష్టంతో వచ్చే సొమ్ముతోనే ప్రత్యేకంగా కాపురం పెట్టుకున్నారు. ఇంటి అద్దె చెల్లించిన పరిస్థితి కూడా ఉంది.
అలా ఎదిగి.. పైకి వచ్చిన చంద్రబాబుకు రాజకీయంగా కాంగ్రెస్‌లో ఇమడలేని పరిస్థితి వచ్చింది. ఒక దశల కమ్మలకు కాంగ్రెస్‌లో సెగ పెట్టారు. అయినా.. తట్టుకుని నిలబడ్డారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌కు పిలుపువచ్చింది. తర్వాత.. మారిన పరిణామాలతో పార్టీకి అధ్యక్షుడు అయినా.. దాదాపు నాలుగు సంవత్సరాలు చంద్రబాబు కంటిపై కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. ఒకవైపు పకాంగ్రెస్ నుంచి సూటిపోటి విమర్శలు.. మరోవైపు టీడీపీలో ఆదిలో తనకు కలిసిరాని నేతలు.. ఇవన్నీ అధిగమిస్తూనే వచ్చారు.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. గత నాలుగేళ్లుగా.. వైసీపీ పాలనలో చంద్రబాబు పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. కార్యకర్తలు జెండాలు పట్టుకునే పరిస్థితి లేని స్థితి వచ్చింది. దీంతో 70 ఏళ్ల వయసులో తానే రంగంలోకి దిగి.. పార్టీని నిలబెట్టుకుంటున్నారు. ఇదీ.. చంద్రబాబు జీవితం. కష్టమే తప్ప.. సుఖం అనే మాట ఎరుగని చంద్రబాబు మరికొన్ని తరాల వరకు ఆదర్శమంటే ఆశ్చర్యం లేదు.