విజన్-ఈ మాట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు. టీడీపీ అధినేతగా ఆయన కేవలం పార్టీకి, పార్టీ ప్రయోజనాలకు మాత్రమే కట్టుబడలేదు. యావత్ దేశానికి దిక్సూచిగా మారే ప్రయత్నాలు చేశారు. అందుకే వాజపేయి ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం వరకు కూడా.. చంద్రబాబును అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారు. వాజపేయి హయాంలోనే పథకాలపై విస్తృత చర్చ సాగింది.
ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే తలంపు అప్పుడే ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమికి బాధ్యుడుగాఉన్న చంద్రబాబును మహిళా సాధికారతకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో కీలక నాయకుడిగా నియమించారు. ఆ క్రమంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటును చంద్రబాబు సూచించారు. దీనిని అన్ని రాష్ట్రాలు కూడా మెచ్చుకున్నాయి. తర్వాత.. కాలంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
అదే సమయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ విధానంపైనా కమిటీని నియమించారు. దీనిలోనూ చంద్రబాబు కు ఘనమైన ప్రాధాన్యం దక్కింది. బ్యాలెట్ వద్దు.. వీవీ ప్యాట్ లు కావాలని.. చెప్పి.. ఎన్నికల్లో మార్పులకు శ్రీకారం చుట్టేలా.. ఖర్చు తగ్గడంతోపాటు పారదర్శకతకు పెద్దపీట వేసేలా చంద్రబాబు చేసిన సూచనలు ఇప్పటికీ అమలవుతున్నాయి.
ఇక, మోడీ హయంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి వ్యూహాలు ఉండాలనే విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో చంద్రబాబుకు స్థానం కల్పించారు. పెద్ద నోట్ల రద్దుపై అందరూ యాగీ చేస్తుంటే.. చంద్రబాబు దీనిని సమర్ధించారు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ వ్యవహారాలు నిలిచిపోతాయని.. మనీ లాండరింగ్‌నేరాలు తగ్గుతాయని చెప్పారు. ఇలా.. ఒక్క పార్టీకి, ఒక్క రాష్ట్రానికి ఆయన పరిమితం కాకుండా.. విశాల భారతావనికి విజన్ ద్వారా అనేక సేవలు చేశారు.