కొన్ని సార్లు ఒక హీరో వద్దకు వెళ్లిన కథలు వాళ్లు రిజెక్ట్ చేయడం వల్లనో ఇతర కారణాల వల్లనో మరో హీరో టేబుల్ పైకి వచ్చి చేరుతాయి. అలా చేరిన కొన్ని కథలు సినిమాలుగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ లుగా నిలుస్తాయి. ఇక హీరోలు అలా సినిమాలను మిస్ చేసుకోవడం చాలా కామన్. ఇక ఓ బ్యూటిఫుల్ ప్రేమ కథను హీరో మహేశ్ బాబు మరియు హీరో సుమంత్ ఇద్దరూ మిస్ చేసుకున్నారు. దాంతో ఆ సినిమా కాస్త తరుణ్ కు అదృష్ట దేవతగా మారింది. ఆ సినిమా మరేదో కాదు నువ్వేకావాలి.
అప్పట్లో ఈ ప్రేమకథా చిత్రానికి యూత్ తో పాటూ ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాతో తరుణ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ సినిమాను సుమంత్ మరియు మహేశ్ బాబులు ఎలా మిస్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం….మలయాళ సినిమా నిరమ్ చూసిన నిర్మాత స్రవంతి రవికిషోర్ ఆ సినిమాను ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ క్యూట్ లవ్ స్టోరీ ఆయన మనసుదోచడంతో పాటూ తెలుగులో పక్కా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు.
ఇక అప్పటికే కొన్ని ఫ్లాప్ లతో ఆయన నష్టాలలో ఉండటం వల్ల రామోజీరావుతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలని అనుకున్నారు. రామోజీరావు వద్దకు వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక హీరోగా మహేశ్ బాబును మొదట అనుకున్నారు. మహేశ్ బాబుకు కథను కూడా వినిపించారు. అయితే రెండు నెలలు గడుస్తున్నా ప్రిన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో అదే కథను హీరో సుమంత్ కు వినిపించారు. అప్పుడే సుమంత్ యువకుడు, పెళ్లి సంబంధం అనే సినిమాలలో నటిస్తున్నాడు.
నువ్వేకావాలి కథ నచ్చినా సుమంత్ కు చేయలని పరిస్థితులు ఉన్నాయి. దాంతో నువ్వేకావాలి సినిమాను చేతులారా వదులుకున్నాడు. ఇక ఆ తరవాత హీరోగా కొత్త హీరో తరుణ్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాకు స్వయంవరం సినిమాతో హిట్ కొట్టిన విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా స్వయంవరం సినిమాకు మాటలు రాసిన త్రివిక్రమ్ ను కూడా ఈ సినిమాలో విజయ్ భాస్కర్ భాగం చేశారు. అలా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు.