టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఒకప్పుడు కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమంత ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. రీసెంట్ గా సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత నటించింది. అంతేకాకుండా ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో సమంత అభిమానులను సంపాదించుకుంది.
ఇక సమంత సినిమా కెరీర్ ఫుల్ సింగ్ లో ఉన్నప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మొన్నటి వరకూ అనారోగ్య సమస్యలతో సమంత బాధపడింది. ఇదిలా ఉంటే నాగచైతన్య కంటే ముందు సమంత సిద్ధార్థ్ తో కూడా లవర్ ఎఫైర్ నడిపింది. అయితే సిద్ధార్థ్ సమంతల ప్రేమాయణం గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు.
అంతేకాకుండా సిద్ధార్థ్ సమంతలు ఎందుకు విడిపోయారు అన్న కారణం కూడా చాలా మందికి తెలియదు. సమంత సిద్ధార్థ్ ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సమయంలో చాలాసార్లు మీడియా కంట పడ్డారు. అయితే అదే సమయంలో సిద్ధార్థ్ వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత అతడికి దూరమైనట్టు వార్తలు వినిపించాయి. మరో అమ్మాయితో కలిసి తిరుగుతూ తనతో రిలేషన్ షిప్ లో ఉండటం సమంతకు నచ్చలేదట. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ 2015లో విడిపోవలసి వచ్చింది.
విడిపోయిన తర్వాత ఓ సందర్భంలో సిద్ధార్థ్ మంచివాడని.. అది తమ పర్సనల్ మ్యాటర్ అని సమంత ట్వీట్ చేసింది. కానీ సిద్ధార్థ్ మాత్రం సమంతను ద్వేషించడం మొదలుపెట్టాడు. నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకున్న సమయంలో కూడా సిద్ధార్థ్ సమంతను కుక్కతో పోలుస్తూ దారుణంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. సమంత చైతుతో విడాకులు తీసుకుని సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.