ముక్కుమీద కోపంతో సెట్స్‌లోనే విరుచుకుపడే వ్యక్తత్వం ఉన్నప్పటికీ అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న మహానటి భానుమతి రామకృష్ణ. సంప్రదాయ బ్రాహ్మణకుటుంబానికి చెందిన భానుమతి.. సెట్స్ లోనూ..అలానే వ్యవహరించారు.అసభ్య పదజాలం కానీ.. ఎక్స్ట్రా డైలాగులు కానీ.. ఆమె నోటి నుంచి వచ్చే వి కాదు. అయితే.. ఆమె నటించిన ప్రతిసినిమాలోనూ.. ఎలాగైనా సరే.. ఒక పాటపెట్టాల్సిందే. దీనికి ఓకే అం టేనే భానుమతి నటించేవారు.
అయితే.. అన్నగారు ఎన్టీఆర్ కన్నా ముందు తమిళనాట.. ఎంజీఆర్ రాజకీయ పార్టీ పెట్టారు. ఎంజీఆర్తోనూ భానుమతి కలిసి నటించారు. ఈ క్రమంలో ఆమెతో ఉన్న చనువు నేపథ్యంలో ఎంజీఆర్ తొలుత.. ఆమెను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఎంజీఆర్‌తో కుటుంబ పరంగా కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో భానుమతి కాదనలేకపోయింది.
నిజానికి ఏ విషయంలో అయినా.. నిర్మొహమాటంగా భానుమతి వ్యవహరిస్తారనే పేరుంది. అలాంటిది.. ఆమె తడబడింది. రాజకీయాల్లోకి వెళ్లాలా.. వద్దా.. అనే సందిగ్ధావస్థలోనే కొనసాగింది. ఎందుకోగాని ఆసక్తి చూపలేదు. రాజకీయాలు తనకు సరిపడవని అనుకుంది. ఇలాంటి సమయంలోనే జయలలితకు.. ఎంజీ రామచంద్రన్ ఆఫర్ ఇచ్చారు.
అంతే.. ఎంజీఆర్ పిలుపుతో.. జయ లలిత ఒక్క ఉదుటున రాజకీయాల్లోకి అడుగులు వేశారు. పార్టీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. తర్వాత పార్టీ పగ్గాలు కూడా చేపట్టారు. అయితే.. వాస్తవానికి భానుమతి కనుక అప్పట్లో రంగంలోకి దిగి ఉంటే.. ఖచ్చితంగా ఆమె కు మంచి లైఫ్ వచ్చి ఉండేదని అంటారు.