ఎన్టీఆర్-అక్కినేని ఇద్దరూకూడా దిగ్గజ నటులే. ఒకానొక సందర్భంలో ఇద్దరూ కూడా పోటీ పడి మరీ నటిం చారు. తెలుగు చలన చిత్రాల్లో ఇప్పటికీ వీరిద్దరినీ బీట్ చేసిననటులు లేరంటే ఆశ్చర్యం వేయక మానదు. దీంతో అక్కినేని, ఎన్టీఆర్‌ల గురించి ఎప్పుడూ కూడా ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంటుంది. వారి గురించి.. ఏదో ఒక విషయంపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది. ఇలాంటివాటిలో ఇద్దరి ఆహారపు అలవాట్లు కూడా ఇంపార్టెంట్.
ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు చూస్తే.. ఉదయాన్నే ఎన్టీఆర్.. తీసుకునేప్రధాన ఆహారం చద్దన్నం అంటే ఆశ్చర్యం వేస్తుంది. అయినా… కూడా నిజం. తర్వాత.. రెండు గంటల గ్యాప్‌తో రెండు ఇడ్లీ.. కొద్దిగా పులి హోరను తీసుకునేవారు. మధ్యాహ్నం.. భోజనంలో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. దీనిలో నాటు కోడి పులుసు లేదా.. నాటు కోడి కూర వంటివి ఉండాలి. ఎన్టీఆర్‌కు రోజు ఉండాల్సింది.. ఏదో ఒక పచ్చడి. ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. వారానికి ఒకసారైనా మాగాయి పచ్చడి ముఖ్యం.
ఇక, అక్కినేని విషయానికి వస్తే.. నాన్ వెజ్‌కు కడుదూరంగా ఉండేవారు. అయితే.. రోజూ అన్నంలో కోడి గుడ్డు తినేవారట. పైగా..అన్నగారిలాగా కాకుండా.. అక్కినేని ఆహారం విషయం అంతా కూడా చాలా వరకు గోప్యంగా ఉండేవారు. ఏదో అప్పుడప్పుడు.. మాత్రం కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చేవి. అక్కినేని మేకపాలతో చేసినపదార్ధాలు మాత్రమే తినేవారు తాగేవారు. పెరుగు , మజ్జిగ లాంటివి. ఊరగాయలకు కడుదూరంగా ఉండేవారు. ఎంతో ఇష్టంగా తినేది మాత్రం.. ఆవడలు.
ఉదయం అక్కినేని ఒక గ్లాసు మేకపాలు తాగి.. గుప్పెడు వేరుశనగ గింజలు తినేవారు. ఇదే ఆయన బ్రేక్ ఫాస్ట్. 10-11 మధ్య ఆకు కూర జ్యూస్,మధ్యాహ్నం భోజనంలో రెండు రొట్టెలు.. వెజ్ కూర, ఆమ్లెట్.. ఆయిల్ లేకుండా.. గ్లాసు మచ్చిగ.. ఇలా.. అక్కినేని స్టయిల్ వేరేగా ఉండేది. మొత్తంగా.. ఇద్దరూ కూడా.. సినిమాలో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు.