నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ దసరా. నాని కెరీర్లో ఏకంగా రు. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా దసరా తెరకెక్కింది. అసలు రు. 70 కోట్ల బడ్జెట్.. అందులోనూ నాని లాంటి హీరోకు అంత వర్కవుట్ అవుతుందా ? అన్న అనుమానాలు చాలానే ఉన్నాయి.
అయితే ఆ అనుమానాలను దసరా తొలి రోజే పటాపంచలు చేసి పడేసింది. సినిమాకు యునానమస్ హిట్ టాక్ వచ్చేసింది. ఇక తొలి రోజు శ్రీరామ నవమి కూడా కలిసి రావడంతో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. యూఎస్ లో అయితే ఈ సినిమాకు దిమ్మతిరిగి పోయే ఓపెనింగ్స్ వచ్చాయి. నాని కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీమియర్ల తోనే ఈ సినిమా దుమ్ము రేపేయగా.. తొలి రోజు కంప్లీట్ అయ్యే సరికి ఏకంగా 8 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి.
ఇది నాని కెరీర్లో రికార్డు ఓపెనింగ్ గా నిలిచింది. అంటే రెండో రోజుకే 1 మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసేయనుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా… తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు, ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.