తమలపాకు అంటే తెలియని మనిషే ఉండరు. అయితే ఈ తమలపాకు తినడంతో కలిగే ప్రయోజనాలు మాత్రం చాలామందికి తెలియదు. ఆయుర్వేదం లో తమలపాకు కి ప్రత్యేక స్థానం ఉంది. తమలపాకుని దైవ కార్యక్రమాలలో, శుభకార్యాల్లో విరిదిగా వినియోగిస్తారు. తమలపాకులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం ఉంటాయి. రోజుకి రెండు తమలపాకులను నమలడం చాలా మంచిది.
భోజనం చేసిన తరువాత 2 తమలపాకులను మిరియాలతో కలిపి నమలడం వలన మనం తీసుకున్న ఆహారం జీర్ణం బాగా అవుతుంది. దీనితో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణ అయ్యి శరీరంలోని వ్యర్ధాలు పూర్తిగా బయటకి వెళితే ఆ మనిషికి ఎటువంటి అనారోగ్యం రాదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు.
అంతేకాకుండా అధిక బరువును తగ్గించడంలో కూడా తమలపాకు బాగా ఉపయోగపడుతుంది. తమలపాకు, మిరియాలు కలిపి తిన్నట్లయితే బరువు తగ్గడంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. చిన్న పిల్లల లో జలుబు సమస్యలు వేధిస్తున్నట్లైతే తమలపాకు లను వేడి చేసి వాటికి ఆమోదం పూసి చేతిపై ఉంచడం వలన త్వరగా జలుబు నయం అవుతుంది.
తమలపాకు తో పాటు యాలుకలు, లవంగం, దాల్చిన చెక్క కలిపి రెండు పుట్ల నీటిలో మరిగించి తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. అంతేకాకుండా ముఖంపై మొటిమలను తగ్గించడంతోపాటు చర్మం మీద ఉన్న ముడతలను కూడా తగ్గించి యవ్వనంగా చేస్తుంది. తమలపాకు రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. తమలపాకుని బాగా గుజ్జు లాగా చేసుకుని జుట్టుకి పట్టించడం వల్ల హెయిర్ ఫాల్, డాండ్రఫ్ నీ తగ్గిస్తుంది.