పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ లతో రూపొందిన సినిమాలకి కలెక్షన్స్ ఆటోమేటిక్గా బాగానే వస్తాయి. కానీ, చిన్న చిత్రాలకు మంచి కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ సినిమా ధియేటర్ వరకు వస్తారు. అలాంటి సినిమాల్లో ‘సామజవరగమన ‘ కూడా ఒకటి.
శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ వసూలు చేసింది. చిన్న సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా స్టోరీ సున్నితంగానే ఉంటుంది. కానీ ఇందులో వినోదం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలు ఈ మధ్యకాలంలో లేవని చెప్పుకోవచ్చు.
సామజవరగమన చిత్రంలో లాభాలపరంగా కూడా ముందుంది. పెట్టుబడిపై రెండు, మూడు రెట్ల లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవ్వడంతో మరోసారి ఈ సినిమా గురించి కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఇంట్రెస్టింగా చూస్తున్నారు. ఈ సినిమాలో ఎంగేజ్మెంట్ ను ఆపే ప్రయత్నంలో శ్రీకాంత్ అయ్యంగార్, రమేష్ మధ్య వాగ్వాదం జరుగుతుంది.
ఆ క్రమంలో నరేష్ మాట్లాడాక, శ్రీకాంత్ తన డైలాగ్ చెప్తాడు. అయితే ఈ ఇద్దరికీ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే ఆర్టిస్టులు ఒకరే. మరి అంత త్వరగా నరేష్ వెనుక నుంచి శ్రీకాంత్ వెనుకకు ఎలా వెళ్లారు..? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలా జరగడం సహజం అంటూ మరికొందరు అంటున్నారు.