చిరంజీవి ‘ ఠాగూర్ ‘ సినిమాలో జ్యోతిక పాత్ర రిజెక్ట్ చేసిన ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు..!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ నటించిన ఎన్నో హిట్ సినిమాలులో ఠాగూర్ సినిమా కూడా ఒకటి. తమిళ్ మూవీ రమణకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రమణ సినిమా తమిళ్లో మంచి హిట్ సాధించడంతో ఈ సినిమాను తెలుగులో చిరంజీవి క్రేజ్‌కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి రూపొందించారు. వివి. వినాయ‌క్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

2023 సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా రూ.6 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమై రూ.30 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. మోత్తం 365 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా 353 సెంటర్లో 50 రోజులు.. 196 సెంటర్స్ లో 100 రోజులు ఆడి రికార్డులను క్రియేట్ చేసింది. అప్ప‌టి వ‌ర‌కు 50 రోజులు, 100 రోజుల ప‌రంగా ఠాగూర్‌దే హ‌య్య‌స్ట్ సెంట‌ర్స్ రికార్డ్‌.

ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో కోలీవుడ్ న‌టి జ్యోతిక నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ఆ పాత్రకు మొద‌ట‌ సౌందర్యని అనుకున్నారట. దానికోసం సౌందర్యను అప్రోచ్ కాగా డేట్స్ అడ్జస్ట్ చేయాలని కారణంతో ఠాగూర్ సినిమాను రిజెక్ట్ చేసిందట. సౌందర్య రిజెక్ట్ చేసిన ఆ సినిమా కోసం నెక్ట్స్‌ మాధురి దీక్షిత్ ను సంప్రదించారు. ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో జ్యోతిక ఈ సినిమాలో నటించింది.

కట్ చేస్తే ఠాగూర్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి చిరంజీవితో పాటు జ్యోతిక‌, శ్రేయాలకు కూడా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజై మంచి సక్సెస్ సాధించిన తర్వాత సౌందర్య ఈ సినిమాను చూసి చాలా బాధపడిందట. డేట్స్ అడ్జస్ట్ లేని ఒక్క కారణంతో ఇలాంటి సినిమాను రిజెక్ట్ చేశానే అని సౌందర్య తెగ ఫీల్ అయిందట.