ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన చైల్డ్‌హుడ్ ఫొటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వారి అభిమాన నటి నటుల ఫోటోలను చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫోటోలో నాట్యం చేస్తూ ముద్దు ముద్దుగా కనిపిస్తున్న ఈ బుజ్జి పాప అలనాటి స్టార్ హీరోయిన్. పదుల సంఖ్యలో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. అప్పటిలోనే గ్లామర్ షో పాత్రలో హద్దులు పెట్టుకోకుండా నటించి కుర్రాళని ఆకటుకుంది.
ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా సినిమాలలో కీ రోల్స్‌లో నటిస్తునే ఉంది. ఆమె నటనకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. నటనలోనే కాక నాట్యంలోనూ తనకు తానే సాటి. ప్రస్తుతం సినిమాల్లో అమ్మ, వదిన, అక్క పాత్రలలో నటిస్తు ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అదే అందం, అభినయంతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాలో హీరోకి తల్లిగా నటించి మెప్పించింది.
ఇంతకీ ఈ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు బాహుబలి సినిమాలో శివగామి పాత్ర పోషించిన రమ్యకృష్ణ. ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది రమ్యకృష్ణ. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. రమ్యకృష్ణ చిన్ననాటి ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram