ఆ పాన్ ఇండియా హీరోకి శ్రీలీలా మరదలు అవుతుందనే విషయం మీకు తెలుసా..!?

టాలీవుడ్ ను తన క‌నుసైగ‌ల‌తో ఏలేస్తున్నయంగ్ హీరోయిన్ శ్రీ లీల. ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో మనందరికీ తెలిసిందే. దాదాపు 10సినిమాలకు పైగా శ్రీ లీల చేతిలో ఉన్నాయి. గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద వంటి భారీ చిత్రాల్లో సైతం శ్రీ లీల చేస్తుంది. ఇప్పుడు ఈ సంగతి పక్కన పెడితే… ‘ కే జి ఎఫ్ ‘ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ హీరో యష్ కు శ్రీ లీల మరదలు అవుతుందని మీకు తెలుసా…? అవును మీరు విన్నది అక్షరాలా నిజం.

కానీ, యష్, శ్రీ లీల బంధువులు అయితే కాదు. వీరి ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు. యష్ కుటుంబంతో శ్రీ లీల ఫ్యామిలీకి మంచి సన్యహిత్యం ఏర్పడింది. యష్ స‌హానటి రాధిక పండిట్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ఒక కూతురు, కొడుకు జన్మించారు. అయితే రాధికాకు డెలివరీ చేసింది మరెవరో కాదు శ్రీ లీల తల్లి స్వర్ణలత.

శ్రీ లీల తల్లి స్వర్ణలత బెంగళూరులో మంచి గైనకాలజిస్ట్. ఆమెకు ఎంతో పేరు కూడా ఉంది. అయితే రాధికాకు రెండు సార్లు స్వర్ణలతానే డెలివరీ చేసింది. ఈ క్రమంలోనే యష్, రాధికలతో, స్వర్ణలత, శ్రీ లీల కు చుట్టరికం ఏర్పడింది. ఆ సన్నిహితంతోనే యష్ నీ బావ అని రాధిక ను అక్క అని పిలుస్తుంది. తరచూ శ్రీ లీల యష్ వాళ్ళ ఇంటికి కూడా వెళుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో శ్రీ లీల స్వయంగా చెప్పింది. అలా హీరో యష్ కు శ్రీ లీల మరదలు అయిపోయిందట.