బాక్సాఫీస్ పై యుద్ధానికి రెడీ అవుతున్న శ్రీ లీల.. వచ్చే ఆరు నెలల్లో అభిమానులకి పండగే పండగ..!

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిన శ్రీ లీల బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీగా ఉంది. వచ్చే ఆరు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలతో తన అభిమానులకి పూనకాలు తెప్పించబోతుంది. ఆగస్టులో ఈ ముద్దుగుమ్మ `ఆది కేశవ‌` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకు ముందుకు రాబోతుంది.

అలాగే సెప్టెంబర్ 18న `స్కంద‌` రిలీజ్ కానుంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో రామ్‌కు జంటగా శ్రీలీల నటించింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో శ్రీలీల బాలకృష్ణ నటిస్తున్న భగవంత్‌ కేసరితో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది.

ఆ తర్వాత డిసెంబర్‌లో శ్రీలీల `ఎక్స్ ట్రా` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా మహేష్‌తో గుంటూరు కారం సినిమాతో సందడి చేయడానికి రెడీగా ఉంది. అయితే గతంలో ఓ హీరోయిన్ నటించిన రెండు మూడు సినిమాలు వరుస‌ నెలలో విడుదలయ్యాయి. కానీ ఇలా ఐదు సినిమాలో అది ఇంత తక్కువ సమయంలో రావడం మాత్రం బహుశా ఇదే మొదటిసారి అనిపిస్తుంది.

ఇవేకాకుండా పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్, నవీన్ పోలిశెట్టి అనగనగ‌ ఒక రాజు తో పాటు మరెన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో ఏ కొన్ని హిట్ అయినా సరే శ్రీ లీల క్రేజ్ మరో లెవల్లో ఉంటుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఇక మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.