వధువుగా అలంకరణ… పెళ్లిరోజు ఆమె జీవితంలో అత్యంత అరుదైన క్షణం. పెళ్లికూతురుగా వేషధారణలో సంపూర్ణంగా ఉత్తమంగా కనిపించడం ఒక ప్రత్యేకమైన క్షణం. అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ‘మేడి ఇన్ హెవెన్ ఆమె(స్త్రీ) జీవితంలోని ప్రత్యేక సందర్భాన్ని తెలిపే ఒక వేదిక. మోస్ట్ ఆవేటెడ్ సీజన్ 2 ట్రైలర్ లాంచ్ కు ముందు సిరీస్ లోని వధూవులు ప్రధాన ఆకర్షణంగా కనిపించారు.
ప్రేక్షకులకి మరింత ఎక్సైట్మెంట్ పెంచారు. అందమైన వధువుల ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులంతా. మృణాల్ ఠాకూర్, రాధికా ఆప్టే, షిబానీ దండేకర్, సారా జేన్-డయాస్, నైనా సరీన్, ఎల్నాజ్ నోరౌజీ, కల్లిరోయ్ త్జియాఫెటా, జైన్ మేరీ ఖాన్, షీనా ఖలీద్ వంటి అందమైన వధువులు ప్రత్యేక చిత్రాలతో ప్రైమ్ వీడియో వీక్షకులను ఆటపట్టిస్తూ టీజర్ ని విడుదల చేశారు.
ఈ టీజర్ లో వధువులుగా నటించిన నటీనటుల కథ ఎలా సాగుతుంది? అదే ఆశ్చర్యంతో అభిమానులలో ఉత్కంఠ నెలకుంది. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2ని ఎక్సెల్ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్, టైగర్ బేబీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్వహించారు. నిత్యా మెహ్రా, అలంకృత శ్రీవాస్తవ, నీరజ్ ఘైవాన్లతో కలిసి రీమా కగ్టి – జోయా అక్తర్‌లు రూపొందించారు. ఈ జోడి స్వయంగా దర్శకత్వం వహించారు.
శోభితా ధూళిపాళ, అర్జున్ మాథుర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ధారవాహితలో జిమ్ సర్భ్, కల్కి కోచ్లిన్, శశాంక్ అరోరా, శివాని రఘువంశీ, విజయ్ రాజ్, మోనా సింగ్, ఇష్వాక్ సింగ్, త్రినేత్ర హల్దా తదితరులతో పాటు కొత్త తరం హీరోయిన్లు నటించారు. 7 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ భారతదేశంలోని ప్రైమ్ వీడియో లో ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు భూభాగాల్లో ఆగస్టు 10 నుంచి ప్రత్యేకంగా ప్రీమియర్ అవుతుంది.
View this post on Instagram