‘బ్రో’ నే కాదు ‘జెర్సీ’ సినిమాలోను ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమాల్లో అవకాశాలు ఎంతో అరుదుగా వస్తుంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్లిన వారే సక్సెస్ అవుతారు. అయితే కొంతమందికి మాత్రం చేతిదాకా అవకాశం వచ్చినట్లే వచ్చి దూరమైపోతుంది. కాని ఆ తర్వాత మరో మంచి అవకాశం వచ్చి వారికి సక్సెస్ ఇస్తుంది. ఈ విధంగా చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ లిస్టు లోకి యాడ్ అవుతుంది రీసెంట్ గా వచ్చిన ‘సామజవరగమన’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ రెబా మోనికా జాన్.

కోలీవుడ్, మలయాళం పరిశ్రమలో పలు సినిమాల్లో నటించిన రెబా టాలీవుడ్ లో నటించిన తొలి సినిమాతోనే భారీ క్రేజ్ ను అందుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు అంతకుముందే రెండు సినిమాల అవకాశం వచ్చినట్లే వచ్చి దూరమయ్యాయి ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న చిన్న సినిమాల్లో ‘సామజవరగమన’ ఒకటి. శ్రీ విష్ణు హీరోగా వ‌చ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటించింది.

అయితే రెబా ఈ సినిమాల కంటే ముందే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాలతో ఆమె టాలీవుడ్ లో అడుగు పెట్టలేక పోయింది. ముందుగా నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమాలో నానికి జంట‌గా శ్రద్ధా శ్రీకాంత్ నటించారు. నిజ‌నికి ముందుగా శ్రద్దా ప్లేసులో రెబా మోనికాను అనుకున్నారు. కానీ ఆమెకు ఆ స‌మ‌యంలో కాల్ షీట్లు కుదరకపోవడంతో ఈ సినిమాను ఒప్పుకోలేదు.ఇక ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సాయి తేజ్‌ కలిసి నటించిన బ్రో సినిమాలోను ఈమెకు హీరోయిన్‌గా నటించే అవకాశం చేతుదాక వచ్చి చేయి జారిపోయిందట.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లవర్ గా నటించే అవకాశం ఈమెకు వచ్చిందట. ముందుగా ఈ సినిమా కోసం టేక్ టెస్ట్ చేశారు. సాయిధరమ్ తేజ్ కి లవర్ గా నన్ను అనుకున్నారు. సెలెక్ట్ అయ్యానో, లేదన్న విషయానికి తర్వాత తెలియజేశారు. కారణమేంటో తెలియదు గాని నన్ను ఓకే చేయలేదు. దీంతో ఆమె ఇక తనకు తెలుగు సినిమాల్లో ఛాన్స్ రాదని కామ్ ఉందట. కానీ ఇంతలో ఓ రోజు ఆమె తన స్నేహితురాలితో కలిసి ఓ సినిమా షూటింగ్ కు వెళ్లింది.

ఇక అదే స‌మ‌యంలో ‘సామజవరగమన’ సినిమా దర్శకుడు రామ్ అబ్బారాజు నన్ను చూసి ఓ సెల్ఫీ కావాలి అని అడిగారు. అప్పటికి నేను ఇంకా తెలుగులో సినిమా చేయలేదు కాబట్టి నేను మీకు తెలుసా? అని అడగగానే ‘సామజవరగమన’ అనే సినిమాలో మిమ్మల్నే హీరోయిన్ గా అనుకున్నాము. కానీ మీరు ఒప్పుకుంటారో? లేదోనని ఎదురుచూస్తున్నాం. అనగానే మాకు కూడా తెలుగు సినిమాలో అవకాశం వస్తుందా? అని ఫన్నీగా అనేసరికి వెంటనే ఓకే చేశారట. దాంతో సామజవరగమన’ సినిమాతో రెబా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన మొదటి సినిమానే సక్సెస్ కావడంతో స్టార్ అయిపోయింది.